వ‌రి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ‌ పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ‌ రికార్డు

0
189
Spread the love

వ‌రి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ‌ రాష్ర్ట పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ‌ రికార్డు

హైద‌రాబాద్ మే 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్): తెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రాష్ర్ట పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ‌ రికార్డు సృష్టించింది. 21 రోజుల్లో 41 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేసిన‌ట్లు పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ‌ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. 10 రోజుల్లో 21.22 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేసిన‌ట్లు తెలిపారు.ఇంత పెద్ద ఎత్తున దేశంలో ధాన్యం పండించిన ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. దాదాపు రూ. 10 వేల కోట్ల‌తో 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేశామ‌ని తెలిపారు. అత్య‌ధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.92 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here