మంత్రి గంగుల‌కు విన‌తి పత్రం ఇచ్చిన రైల్ మిల్ల‌ర్లు

0
64
Spread the love

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో మహబూబ్ నగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర BC వెల్ఫేర్, సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి  గంగుల కమలాకర్ ని కలసి వానాకాలం 2021 – 22 సంవత్సరం FCI నుండి సివిల్ సప్లయి & CMR ధాన్యం డెలివరీ మార్చాలని వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్,  గంగుల కమలాకర్ కు  మహబూబ్ నగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు 2021 – 22 వానాకాలం రా రైస్ మిల్లర్స్ 158934 మెట్రిక్ టన్నుల ధాన్యం ను దించుకున్నాము. ఇందులో భాగంగా 76000 వేల మెట్రిక్ టన్నుల ధాన్యము మర పట్టించి సివిల్ సప్లై వారికి డెలివరీ చేయడం జరిగింది. మిగిలిన ధాన్యం ను మర పట్టించి FCI వారికి డెలివరీ చేయుట ప్రారంభించాము. కానీ FCI వారు రా రైస్ మిల్లర్స్ ను అనేక రకాలుగా అనగా టిప్ డమేజ్, పిన్ పాయింట్ డమేజ్ అని ఏవోవో కారణాలు చూపించి భూతద్దంలో బియ్యాన్ని పరిశీలించి కక్ష్య సాధించే ఉదేశ్యం లో మా బియ్యాన్ని రిజెక్ట్ చేసి నరకం చూపిస్తున్నారు.. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గార్లు మాపై దయవుంచి 25000మెట్రిక్ టన్నుల ధాన్యం ను FCI నుండి సివిల్ సప్లై వారికి డెలివరీ చేయువిధంగా తగు ఉత్తర్వులు జారీ చేయగలని మిల్లర్ల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మిల్లర్స్ చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ది మహబూబ్ నగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు , కార్యదర్శి మనోహర్, ట్రెజరర్ రామకృష్ణ, టౌన్ అధ్యక్షుడు కృష్ణయ్య, మిల్లర్ల్స్ మధుసూదన్, C. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here