చిన్న పత్రికల సంఘం ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు. గత మూడు సంవత్సరాల నుండి చిన్న పత్రికల సమస్యలు పరిష్కారం కాక ప్రకటనలు లభించక అనేక ఇబ్బందుల్లో ఉండడం వల్లనే పోరాటాలు చేశాం. నిరసన ప్రదర్శనలు చేసాం. ధర్నాలు కూడా చేశాం ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేయడానికి ఈ రోజు సమావేశమయ్యాము. చిన్న మధ్యతరహా దినపత్రికల మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార శాఖ నుండి ప్రతి నెల ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించి ఈ నెల నుండి ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించడంతో ప్రభుత్వానికి కి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు సమాచారశాఖ కమిషనర్ అరవింద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గత మూడేళ్ల నుంచి ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు అధికార పార్టీ ముఖ్యులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చామని అనేక సంఘాల నాయకులకు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలకు ఎమ్మెల్యేలకు తమ సమస్యలు వివరించామని, జర్నలిస్టు సంఘాలకు విజ్ఞప్తులు చేశామని అందరూ సానుకూలంగా స్పందించారని యూసుఫ్ బాబు చెప్పారు. నిజమైన జర్నలిస్టు సంఘాలు అసోసియేషన్లు తమ హక్కుల కోసం పోరాడుతారు, హక్కులను సాధించుకున్న తర్వాత సమస్యల పరిష్కారానికి సహకరించి కృషిచేసిన వారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారని పేర్కొన్నారు.
తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ)కు అనుబంధంగా పనిచేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న చిన్న పత్రికల సంపాదకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ స్వాగతం పలుకుతూ గత ఐదేళ్ల నుండి అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఉప ప్రధాన కార్యదర్శి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు దయానంద్ అల్వాల హనుమంతు, అక్తర్ హుస్సేన్, ఆజంఖాన్ వెంకటయ్య, రాజేష్, షరీఫ్ మహమ్మద్, యూసుఫ్ఉద్దీన్ ఖాద్రి, అఫ్రోజ్ కురేషి, మహమ్మద్ ఖాసిం, రాజిరెడ్డి, కొండకింది మాదవరెడ్డి, రామకృష్ణ,రామారావు, అంజయ్య ,పృథ్వి రాజ్ సాయిరాం ,అమన్, తదితరులు పాల్గొన్నారు.