సీఎం కెసిఆర్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కొన్నేళ్లుగా ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్న ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు చివరకు విసిగిపోయి పోరుబాట పట్టారు. ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తెరాసకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టారు. ఇందులో భాగంగా హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు చిన్న, మధ్యతరహా దినపత్రికల సంపాదకులు, జర్నలిస్ట్ సంఘాల మద్దతు పలికాయి. ఈ రోజు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల ఆత్మగౌరవం రోజురోజుకూ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ ప్రభుత్వం చిన్న పత్రికలకు తీరని అన్యాయం చేస్తోందని వివర్శించారు. ఇక నుంచి రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగిన…. టి.ఆర్.ఎస్.కు వ్యతిరేకంగా పనిచేస్తామని… అందులో భాగంగానే ప్రస్తుతం ఈటల రాజేందర్‌కు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరుబాటను వదిలేది లేదని సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు అశోక్, దయానంద్, అక్తర్ హుస్సేన్, ఇక్బాల్ హుస్సేన్, అమన్, వెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Watch Press Meet Full Video – Telangana Small Mediuam News Papers & Magazines Association Press Meet from Somajiguda @ Press Club of Hyderabad