నెల నెల ప్రకటనలు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారించాలని వినతి

0
163
vinod kumar with media persons
Spread the love

సి.ఎం.కేసీఆర్ గార్కి నివేదిక అందజేస్తా

ముందుగా సమాచార శాఖ కమిషనర్ తో ఈ విషయం చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

ప్రణాళిక సంఘ నాయకులు వినోద్ కుమార్

బంజారాహిల్స్, హైదరాబాద్, డిసెంబర్ 31:

తెలంగాణ రాష్ష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ను చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు గురువారం ఉదయం కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు గారి ఆధ్వర్యంలో తేదీ 31.12. 2020 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో గల మినిస్టర్స్ క్వార్టర్స్ లో శ్రీ బోయిననపల్లి వినోద్ కుమార్ గారిని వారి నివాసంలో కలిసి చిన్న పత్రికల సమస్యల పై వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల ప్రకటనలు లేక రాక చిన్న పత్రికలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని , కావున చిన్న పత్రికల కు ప్రతినెలా ప్రకటనలు విడుదల చేసి ఆదుకునేలా మా సమస్యను సీఎం గారి దృష్టి కి తీసుకెళ్లాల్సిందిగా కోరడం జరిగింది. అన్ని విషయాలు వినోద్ కుమార్ గారికి వివరంగా వివరించగా సానుకూలంగా స్పందిస్తూ సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడిన తర్వాత సీఎం దృష్టి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యూసఫ్ బాబు ,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ , ఉపాధ్యక్షులు జానకిరామ్ సీఆర్. అగస్టీన్ , రాష్ట్ర నాయకులు బి.వెంకటయ్య, జూన్ షహీద్, అఫ్రోజ్, ఖాసిం తదితర పత్రికా సంపాదకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here