బాలలను ఆదుకునేందుకు బాల రక్షక్ వాహనాలు

0
77
Spread the love

ఆపదలో ఉన్నబాలలను ఆదుకునేందుకు
జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలు విడుదల

1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ముమ్మర చర్యలు

సిఎం కేసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో బాలల హక్కుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత

ఈ వాహనాలకు ప్రోత్సాహం ఇచ్చి, నడిపించిన మంత్రి కేటిఆర్ గారికి ధన్యవాదాలు

ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తున్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మా బాధ్యత మరింత పెరిగింది
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తూ తోడ్పాటునిచ్చే సంస్థలన్నింటికి కృతజ్ణతలు

రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్

(హైదరాబాద్, నవంబర్ 14) ఆపదలో ఉన్న బాలలను తక్షణమే ఆదుకునేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు, 1098 కి డయల్ చేయడం ద్వారా వారికి ఈ ప్రభుత్వం ఆపధ్బందువు వలె అండగా ఉంటుందని ప్రచారం చేయడానికి అనువుగా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా బాల రక్షక్ వాహనాన్ని కేటాయిస్తూ 33 జిల్లాలకు 33 వాహనాలను నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్ తో కలిసి విడుదల చేశారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చిన సంస్థలన్నింటికి పేరు,పేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు ఇలాంటి తోడ్పాటునివ్వడం వల్ల మా బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఈ వాహనాలు సమకూర్చడం కోసం ఎన్జీవోలను ప్రోత్సహించి, మార్గనిర్దేశనం చేస్తూ మమ్మల్ని నడిపించిన యువ నాయకులు, మంత్రివర్యులు కేటిఆర్ గారికి ధన్యవాదాలన్నారు.


మంత్రి సత్యవతి రాథోడ్ Comments

ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పిల్లలంతా ఆనందంతో వేడుకగా జరుపుకునే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు.

పిల్లలకు ఆపద వస్తే ఆదుకునేందుకు ఉపయోగించే 1098 నంబర్ బాగా ప్రచారం అయ్యేలా ఒకేసారి 33 బాల రక్షక్ వాహనాలను విడుదల చేయాలని స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తూ మాకు మార్గనిర్ధేశనం చేసి నడిపించిన రాష్ట్ర యువ నాయకులు, మంత్రివర్యులు కేటీఆర్ గారికి ధన్యావాదాలు. ఇందుకు సహకరించిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మల్లారెడ్డి యూనివర్శిటీ, మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాట్కో ఫార్మా లిమిటెడ్, కన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పౌండేషన్, నిర్మాణ్ సంస్థ, ఐసీఐసీఐ ఫౌండేషన్, వారధి ఫౌండేషన్, సుమధుర ఫౌండేషన్, యశోదా ఫౌండేషన్, మిస్ ఇండియా మానస వారణాసి, డిఎంఎఫ్టి నాగర్ కర్నూలు, సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ సంస్థలన్నిటికి కృతజ్ఞతలు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సంస్థలన్నీ ప్రభుత్వానికి అండగా ఉండడం నిజంగా మాకెంతో గర్వ కారణం.

కోవిడ్ సమయంలో వీరంతా ఎంతో గొప్పగా సహకరించారు.

గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనివ్వడం, జన్మనిచ్చిన తర్వాత వారికి ఆలనా, పాలన, ఎదుగుదలకు తోడ్పాటునందించడం, నాణ్యమైన విద్య, పోషకాహారం ఇవ్వడం, జీవితంలో ఉన్నతంగా స్థిరపడడం, అనంతరం పెళ్లి అయ్యే వరకు అడుగడుగునా అనేక పథకాలతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తల్లి వలె ఆలోచించి, గొప్ప మనసుతో అండగా నిలుస్తున్నారు.

గతంలో హాస్టళ్లలో పరిస్థితులు బాలేక అక్కడి నుంచి పారిపోయేవారు. కానీ ఇప్పుడు గురుకులాలు ఎప్పుడు తెరుస్తారు అనే డిమాండ్ చేసే వరకు వచ్చిందంటే.. వీటిని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నామనేది తెలుస్తుంది. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు పెట్టి సిఎం కేసిఆర్ గారు నాణ్యమైన విద్య, పోషకాహారాన్ని అందిస్తున్నారు.

ఈ రాష్ట్రంలో అనాథలు అనేవారు ఉండకూడదని వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి, వారికి కుటుంబం ఏర్పాటు అయ్యే వరకు చేయూత ఇవ్వాలని సిఎం కేసిఆర్ గారు సంకల్పించారు.

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలకు నిండు మనసుతో సహకరిస్తున్న వారందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు.

కమిషనర్  దివ్య దేవరాజన్ Comments

దేశంలో ఇలాంటి వినూత్న, మానవత్వ కార్యక్రమం దేశం ఇదే మొదటిదని…నేడు జాతీయ బాలల దినోత్సవం రోజున జరుపుకోవడం ఎంతో విశిష్టమైనది.


ఈ వాహనాల వల్ల శాఖకు ఏనుగు అంత బలం లభించింది. ఇందులో వాహనాలను అందించిన దాతలు చాలా గొప్పగా స్పందించారు. ఒక్క ఫోన్ కాల్ చేయడంతోనే ఎంతో ఉదారంగా, ఉత్సాహంగా స్పందించి, ముందుకు వచ్చి, ఈ గొప్ప సంకల్పానికి తోడ్పాటు అందించిన వారందరికీ ధన్యవాదాలు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస రావు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరంత వీరందరికీ మంత్రి గారు, కమిషనర్ మెమెంటోలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు.

 

ఆపదలో ఉన్నబాలలను ఆదుకునేందుకు
జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలు విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here