క‌రోనా కేసులు పెర‌గ‌డంతో తెలంగాణ స‌ర్కార్ క‌ఠిన‌ నిర్ణ‌యాలు

0
198
Spread the love

క‌రోనా కేసులు పెర‌గ‌డంతో
తెలంగా స‌ర్కార్ క‌ఠిన‌ నిర్ణ‌యాలు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాలు, ప‌ని ప్ర‌దేశాలు, ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల్లో మాస్కుల వినియోగం త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మాస్కులు ధ‌రించని వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం, ఐపిసి కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. ర్యాలీలు ఒకేచోట ప్ర‌జ‌లు గుంపులుగా ఉండ‌టంపై ఆంక్ష‌లు విధించింది. ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ఎలాంటి ర్యాలీలు, ఉత్స‌వాల‌కు అనుమ‌తి లేద‌ని తెలిపింది. బ‌హిరంగ ప్ర‌దేశాలు, స్థ‌లాలు, పార్కు్ల్లో ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని పేర్కొంది. హోలీ, ఉగాది, శ్రీ‌రామ‌న‌వ‌మి, మ‌హావీర్ జ‌యంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ త‌దిత‌ర ప‌ర్వ‌దినాల్లో ఎలాంటి మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. నిబంధ‌న‌లు విధిగా అమ‌ల‌య్యేలా చూడాల‌ని రాష్ట్రంలోని జిల్లా క‌లెక్ట‌ర్లు, పోలీస్ క‌మిష‌న‌ర్లు, ఎస్‌పిల‌కు అదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here