మట్టి లో మాణిక్యం..చంద‌లాపూర్ యువ‌కుడు సుమంత్ శర్మ

0
57
Spread the love

మట్టి లో మాణిక్యం..

చంద‌లాపూర్ యువ‌కుడు సుమంత్ శర్మ

 

హైద‌రాబాద్ ‘సాధ‌న‌మున ప‌నులు స‌మ‌కూరు ధ‌ర‌లోన‌’ అన్న వేమ‌న వ్యాక్య‌ల‌కు కార్య‌రూపం ఇస్తూ.. జాతీయ స్థాయిలో తెలుగువాడి స‌త్తాను చాటాతున్నాడు చిన్న‌కోడూరు మండ‌లం చంద‌లాపూర్‌కు చెందిన యువ‌కుడు సుమంత్ శర్మ . కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల భ‌ద్ర‌తా ద‌ళంలో (సీఐఎస్ఎఫ్ ) అత్యంత కీల‌క‌మైన అసిస్టెంట్ కమాండ‌ర్ నియ‌మ‌కాల కోసం ‘యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్’ (యుపీఎస్‌సీ) 2019లో నిర్వ‌హించిన ప్ర‌వేశ అర్హ‌త ప‌రీక్షలో జాతీయ స్థాయి పోటీ ఎదుర్కొని ఉద్యోగ అర్హ‌త‌ సాధించాడు సుమంత్ శర్మ . చంద‌లాపూర్ గ్రామానికి చెందిన వెలేటి శ్రీనివాస్ శర్మ, వెలేటి శ్రీలత కుమారుడైన సుమ్మిత్‌ది ఈ గ్రామంలో సాధార‌ణ కుటుంబం. చిన్న‌ప్ప‌టి నుంచి చురుకైన అబ్బాయిగా పేరున్న‌ సుమంత్ కేంద్ర బ‌ల‌గాల ద‌ళంలో సెలెక్ట్ కావడం అప్ప‌ట్లోనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
విమ‌ర్శ‌ల‌కు త‌గిన స‌మాధానం..
త‌న‌ను వ‌రించిన కీల‌క ఉద్యోగ పోటీలో కేవ‌లం అర్హ‌త సాధించ‌గానే స‌రిపోద‌ని.. కేంద్ర బ‌ల‌గాల ద‌ళంలో పోటీని గెలిచి నిలవాలంటే ఎంతో క‌ఠిన‌మైన శిక్ష‌ణ‌లో గెలిచి నిల‌వాల‌ని శ‌ర్మ ముందుగానే గ్ర‌హించాడు. దీంతో బాగా క‌ఠిన‌మైన శిక్ష‌ణ‌లోఒక‌టైన సీఐఎస్ఎఫ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో గెలిచి నిలిచేందుకు ఎంతో క‌ఠినంగా శ్ర‌మించారు. క‌ఠిన‌మైన సీఐఎస్ఎఫ్ శిక్ష‌ణ‌ను సుమ్మిత్ త‌ట్టుకోలేడ‌ని.. తిరిగి ఇంటికి వ‌చ్చేస్తాడులే అంటూ తేలిక‌గా తీసిపారేసిన‌ వారికి ఆయ‌న క‌ఠిన శ్ర‌మ‌తో స‌మాధానం ఇచ్చాడు. త‌న ఉద్యోగ శిక్ష‌ణ‌లో మేటిగా నిలిచి స‌త్తా చాటాడు. క‌ఠిన సాధ‌న‌తో విమ‌ర్శ‌కులకు త‌గిన స‌మాధానం చెప్పాడు.


పాసింగ్ అవుట్ ప‌రేడ్‌.. అభినంద‌న‌లు

సీఐఎస్ఎఫ్ బ‌ల‌గాల 34వ బ్యాచ్ అసిస్టెంట్ క‌మాండెట్ల‌ దిక్షంత్ ప‌రేడ్ శుక్ర‌వారం హ‌కీంపేట‌లోని
ఎన్ఐఎస్ఏ సెర్మోనియ‌ల్ గ్రౌండ్‌లో జరిగింది. సీఐఎస్ఎఫ్ ఏడీజీ ఐపీఎస్ నైనా సింగ్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు దాదాపు 14 నెల‌ల సీఐఎస్‌ఎఫ్ శిక్ష‌ణ‌లో మేటి ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన సుమ్మిత్ శ‌ర్మ‌ను సీఐఎస్ఎఫ్ ఏడీజీ ప్ర‌త్యేకంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here