ముగిసిన తెలంగాణ యువ నాటకోత్సవం-6

0
69
Spread the love


ముగిసిన తెలంగాణ యువ నాటకోత్సవం-6

“తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ” మరియు “తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)” సంయుక్తంగా నిర్వహిస్తున్న నాలుగురోజుల “తెలంగాణ యువ నాటకోత్సవం-6 ఈ రోజు ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు విచ్చేసి నాటక బృందాలను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… నాటకం చాలా గొప్పదని, నాటకాన్ని ఫ్యామిలి మొత్తం కలిసి చూడొచ్చని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ నాటకరంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందని, తెలంగాణ యువ నాటకోత్సవం పేరిట యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్నారు.

 

గత ఐదేళ్ళగా నిర్వహించబడుతున్న యువ నాటకోత్సవం ఐదు సీజన్స్ లో యువ నాటక కళాకారులచే 55 కొత్త నాటికలను ప్రదర్శించి, సీజన్-6లో భాగంగా నాలుగు రోజులపాటూ 600మంది కళాకారులతో మరో 10 నాటికలు ప్రదర్శించబడ్డాయని, యువ నాటకోత్సవంను నిర్వహిస్తూ భాషా సాంస్కృతిక శాఖ నుండి ఒక్కో నాటికకు 40వేల రూపాయల ప్రదర్శన పారితోషికం అందిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడలేని విధంగా యువ నాటకోత్సవాన్ని రూపొందించి నిర్వహిస్తున్న సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని, ఇందులో పాల్గొన్న యువ కళాకారులందరిని అభినందించారు.

నేటి యువత సరైన మార్గంలో కాకుండా దారి తప్పుతున్న తరుణంలో వారిలో చైతన్యం నింపుతూ, వారికి సరైన మార్గాన్ని చూపించే విధంగా “మారక ద్రవ్యాలు- వాటి ప్రభావాలు” అనే కాన్సెప్ట్ తో నాటికలు పోటీలు, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here