ముందుగా నామినేషన్ వేసిన అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్

0
215
Spread the love

ఈ నెల 9 న ఫిలిం ఫెడరేషన్ ఎన్నికలు

ఈ నెల 5 న నామినేషన్ ఉపసంహరణ, గుర్తులు కేటాయింపు

ముందుగా నామినేషన్ వేసిన అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 2021- 2022 ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలకు గాను నామినేషన్ సోమవారం ముగిసింది. వేంకటగిరి లో ఎన్నికల అధికారి చౌదరి అందించిన వివరాలు ప్రకారం ఈ నెల 9 న జరగబోవు ఎన్నికలకు ఫెడరేషన్ కు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు గాను 8 మంది సోమవారం నామినేషన్ దాఖాలు చేసారు. ఫెడరేషన్ అధ్యక్షులు గా వల్లభనేని అనిల్ కుమార్, కొమర వెంకటేష్, ప్రధాన కార్యదర్సులుగా పి.ఎస్.ఎన్ దొర, లలిత, సాంభశివరావు, రమేష్ రాజా, కోశాధికార్లుగా కట్టా రాజేశ్వర రెడ్డి, ఈస్వర రెడ్డి నామినేషన్ వేశారు. ఈ నెల 5 మధ్యాహ్నం రెండు గంటల లోపు నామినేషన్ ఉపసంహరణ కు గడువు ఇవ్వగా పోటీచేసే అభ్యర్థులకు ఇదే రోజు మద్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు గుర్తులు కేటాయించనున్నారు. ఈ నెల 9 వతేది ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నారు.

ముందుగా నామినేషన్ వేసిన అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్

ఆదివారం జరగబోవు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 2021- 2022 ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలకు గాను అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ నుంచి ముందుగా ఫెడరేషన్ అధ్యక్షులు గా వల్లభనేని అనిల్ కుమార్ , ప్రధాన కార్యదర్శి గా పి.ఎస్.ఎన్ దొర , కోశాధికారిగా కట్ట రాజేశ్వర రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసారు. ఇదే ప్యానెల్ లో లలిత కూడా ప్రధాన కార్యదర్శి గా మరో నామినేషన్ ధాఖలు చేసారు. ఈ సందర్బంగా అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ కి ముందుగా పలువురు అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here