సిడ్ని క్రికెట్ స్టేడియం వేదిక‌గా సికింద్రాబాద్ తేరాస అభ్య‌ర్థి ‘ప‌ద్మారావు’ కోసం ప్ర‌చారం

0
299
Spread the love

త‌మ అభిమాన నాయ‌కుడికి ఓటు వేయండంటూ ప్ల కార్డు ప‌ట్టుకొని క్రికెట్ స్టేడియంలో ప్ర‌ద‌ర్శ‌న‌గా యువ‌కులు క‌న‌ప‌డ‌డం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అదీ దేశం కాని దేశంలో….ఆస్ట్రేలియాలో. తెలంగాణ నేత‌లు ఎన్నిక‌ల బీజీలో ఉంటే…. అక్క‌డ భార‌త… ఆస్ట్రేలియా మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌రుగుతోంది. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వెళ్లిన కొంద‌రు యువ‌కులు సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం టి.ఆర్‌.ఎస్‌. అభ్య‌ర్థి టి.ప‌ద్మ‌రావుకు మ‌ద్ద‌తుగా ప్ల కార్డులు ప‌ట్టుకొని సంద‌డి చేశారు. కొంద‌రు తెలుగు NRI అభిమానులు సికింద్రాబాద్ టిఆర్ యస్ అభ్యర్ధి పద్మారావు ను గెలిపించాలంటూ ఆస్ట్రేలియా లోని సిడ్ని స్టేడియం వేదికగా ప్రచారం నిర్వహించడం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ఈ రోజు మంత్రి పద్మారావు సికింద్రాబాద్ నియోజికవర్గంలోని సీతఫలమండి, బౌద్దనగర్ డివిజన్ లతో పర్యటించారు.. సీతఫలమండి లో నూతన పార్టీ కార్యలయం ను ప్రారంభించడంతో పాటు, బౌద్ద నగర్ లో తెరాస జేండా ను ఎగరవేసి ప్రచారం నిర్వహించారు. అస్ట్రేలియాలో NRI అభిమానులు స్పందన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందొన్నారు మంత్రి ప‌ద్మార‌వు. తిరిగి మ‌ళ్లీ న‌న్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే…. మరిన్ని నిధులతో సికింద్రాబాద్ ను అభివృద్ది పధంలో తీసుకవెళ్తనాని వాగ్దానం చేశారు మంత్రి పద్మారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here