రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో అధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

0
112
Spread the love

రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో అధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

హైదరాబాద్, నవంబర్ 26, 2021 –కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) అధ్వర్యంలో కోఠి మహిళా కళాశాల లో శుక్రవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఒబి అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత, ప్రొఫెసర్ అరుణ, ఎగ్జిబిషన్ అధికారి అర్థ శ్రీనివాస్ పటేల్ విద్యార్థుల చేత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. అలాగే నగరానికి చెందిన వివిధ కళాశాల విద్యార్థినులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఒబి అసిస్టెంట్ డైరెక్టర్ భారతలక్ష్మి, టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ శతరూప దత్త, పోస్టల్ డిపార్ట్ మెంట్ సూపెరిండెంటెంట్ విష్ణు జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ కవిత, అధ్యాపకులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ రూపకల్పన, విశిష్టతలపై ఏర్పాటుచేసిన చాయా చిత్ర ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకున్నది. భారత రాజ్యాంగ విలువలను దేశ ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో… రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) ఆధ్వర్యంలో… వక్తృత్వ, క్విజ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించామని, అలాగే భారత రాజ్యాంగం, దాని విశిష్టత గురించి తెలియజేసే ఫోటో ప్రదర్శనకు అద్భుత స్పందన లభించిందని ఆర్ఒబి అసిస్టెంట్ డైరెక్టర్ ఇనుముల హరిబాబు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here