వెయిట్రెస్ కు .. రూ.3.67 లక్షల టిప్ ఇచ్చిన మ‌హిళ‌

0
159
Spread the love

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఆసక్తికర ఘటన జరిగింది. పెన్సిల్వేనియోలో ఆంథోనీస్ ఎట్ పాక్సన్ హాలో అనే రెస్టారెంటు ఉంది. జియానా డి ఏంజెలో అనే అమ్మాయి ఈ రెస్టారెంటులో పార్ట్ టైమ్ వెయిట్రెస్ గా ఉద్యోగం చేస్తోంది. జియానా ఓ యూనివర్సిటీలో నర్సింగ్ విద్య అభ్యసిస్తోంది. కాలేజి ఫీజుల కోసం ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటుంది.

ఒకరోజు, జియానా పనిచేస్తున్న పాక్సన్ హాలో రెస్టారెంటుకు ఓ మహిళ వచ్చింది. తనకు నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చి ఎంచక్కా భోంచేసింది. ఆమెకు జియానానే అన్నీ వడ్డించింది. బిల్లు 205 డాలర్లు కాగా, ఆ మహిళ ఏకంగా 5 వేల డాలర్ల టిప్పు ఇచ్చింది. భారత కరెన్సీలో ఇది రూ.3.67 లక్షలకు సమానం. కళ్లు చెదిరే రీతిలో టిప్పు అందుకున్న వెయిట్రెస్ జియానా ఉబ్బితబ్బిబ్బయిపోయింది.

ఇంత మొత్తాన్ని టిప్పుగా అందుకుంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని వెల్లడించింది. కొంత డబ్బుతో కాలేజి ఫీజలు చెల్లిస్తానని, మరికొంత సొమ్మును సామాజిక సేవకు వినియోగిస్తానని వెల్లడించింది. కాగా, ఈ భారీ టిప్పు విషయాన్ని రెస్టారెంటు యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అందరికీ తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here