రాజకీయాల్లో మహిళల శక్తిని పెంచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది – నందమూరి సుహాసిని

0
48
Spread the love

కుక‌ట్‌పల్లి నియోజకవర్గ మహా కూటమి అభ్యర్థిని నందమూరి సుహాసిని ఈ రోజు ఓల్డ్ బోయిన్పల్లిలో పర్యటించారు. ప్రచారానికి వ‌చ్చిన ఆమెకు స్థానిక ప్ర‌జ‌లు హారతులిచ్చి మ‌రీ స్వాగతం పలికారు. రాజకీయాల్లో మహిళల శక్తిని పెంచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓల్డ్ బోయిన్పల్లి ఆర్ ఆర్ నగర్ లో ఎన్నిక‌ల కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో సుహాసిని మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే స్పందన బాగా ఉంద‌ని తెలిపారు. ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేయడం సంతోషం ఉందని చెప్పారు.
మహా కూటమిని త‌ప్ప‌కుండా గెలిపించాలని ఆమె ఓట‌ర్ల‌ను కోరారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here