గవర్న ర్ త‌మిళ‌సైకు బ‌హిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

0
57
Spread the love

గవర్న ర్ త‌మిళ‌సైకు బ‌హిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి


రాష్ట్రంలో తెరాస నేత‌లు, ఇతర్ ప్ర‌యివేటు వైద్య, విద్య కళాశాలలోో పీజీ సీట్ల‌ల్లో దందాపై చర్య లు తీసుకోవాల‌ని కోరుతూ గవర్న ర్ త‌మిళ‌సైకు బ‌హిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీప్‌ రేవంత్ రెడ్డి .
ప్ర‌యివేటు వైద్య క‌ళాశాల‌లు సీట్ల‌ను బ్లాక్ చేసి కోట్ల రూపాయిలు దండుకుంటున్నాయని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. వైద్య సీట్ల దందాలో మంత్రులు కూడా భాగ‌స్వామ్యం కావ‌డం దారుణమ‌ని విమ‌ర్శించారు. మంత్రులు మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ఎమ్మె్ల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర రెడ్డిలు సీట్ల దందాకు పాల్ప‌డుతున్న‌ట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారని రేవంత్ తెలిపారు. నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగుల‌ను ఆస‌రా చేసుకుని ఏటా రూ. వంద కోట్లు మేర సీట్ల‌ను బ్లాక్ చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్ర‌యివేటు క‌ళాశాల‌ల్లో సీట్ల కోసం ధ‌ర‌ఖాస్తు చేయించ‌డం, సీట్ల కేటాయింపు చేయ‌డం కౌన్సిలింగ్ పూర్త‌య్యిన తరువాత అదే సీటును బ్లాక్‌లో ఇత‌రుల‌కు రెండు నుంచి రెండున్న‌ర‌ కోట్ల‌కు అమ్ముకోవ‌డం మామూలైపోయింద‌న్నారు. క‌న్వీన‌ర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు రావ‌ల్సిన సీట్ల‌ను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నర‌ని దుయ్య‌బ‌ట్టారు. బ్లాక్ మార్కెట్‌లో వైద్య సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య సీట్ల దందాపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను రేవంత్ రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here