రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రను అభినందించిన మంత్రి గంగుల

0
76
Spread the love

తెరాస రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రను అభినందించిన మంత్రి గంగుల కమలాకర్

వెనుకబడిన వర్గాల వ్యక్తికి రాజ్యసభ సీటు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

మున్నూరు కాపు లను అత్యధికంగా ఆదరించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయంగాను మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం దే

కెసిఆర్ గారు బీసీల పక్షపాతి – మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎంపికైన అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రను ఈరోజు హైదరాబాద్ లో మంత్రి ఘనంగా సన్మానించారు, ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం మున్నూరు కాపులకు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అందిస్తూ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా పేరున్న గాయత్రి రవి, రాజ్యసభ ఎంపీగా ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం దొరకడం అభినందనీయమన్నారు మంత్రి గంగుల కమలాకర్.

తెలంగాణ రాష్ట్రంలోనే, సీఎం కేసీఆర్ గారి సారథ్యంలోనే వెనుకబడిన వర్గాలకు అందులో భాగమైన మున్నూరు కాపులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత దక్కుతుందన్నారు మంత్రి గంగుల, వ్యవసాయం చేసి అన్నం పెట్టి కడుపు నింపే మున్నూరు కాపులను గతంలో పట్టించుకోలేదని కేవలం ఓటు బ్యాంకు గానే చూశారని కెసిఆర్ గారి నాయకత్వంలోనే ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ గారికి మున్నూరు కాపు జాతి ఎల్లప్పుడు రుణపడి ఉంటుందన్నారు, ప్రతిష్టాత్మక హైదరాబాద్ నగరానికి తొలి మేయర్, మలి మేయర్ లతోపాటు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రిగా తనకు, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, స్థానిక సంస్థల్లో ఎంతోమంది మున్నూరు కాపులకు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో లో తెరాస రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇతర తెరాస, మున్నూరు కాపు నేతలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here