రైతాంగానికి ప్రయోజనాలిచ్చే అంశంపై రాజ‌కీయం వ‌ద్దు

0
51
Spread the love

కల్లాల్లో కల్లోలం… పార్లమెంట్ పదం కూడా పలకరా?
తెలంగాణ బీజేపీ ఎంపీల ద్వంద వైఖరిపై ఫైర్

రైతాంగానికి ప్రయోజనాలిచ్చే అంశంపై రాజ‌కీయం వ‌ద్దు

– టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు

తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాల్లో కలం సృష్టిస్తూ అదే విషయంపై పార్లమెంట్లో పదం కూడా పలకారా? అని తెలంగాణ బీజేపీ ఎంపీల ద్వంద వైఖరిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. రైతులకు ప్రయోజనాలను చేకూర్చే విషయంలో రాజకీయాలొద్దని హెచ్చరించారు. రైతాంగం సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రాష్ట్ర బీజేపీ నేతలు కలిసి రావాలని సూచించారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతులు పండిస్తున్న పంటపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. తమ రాష్ట్ర రైతాంగ ఇబ్బందులు, పంట కొనుగోలుకు సంబంధించిన ప్రధాన సమస్యను ఈనెల 28న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ముందస్తుగా జరిగిన అఖిల పక్షం సమావేశంలో చెప్పామని తెలిపారు. ముందస్తుగానే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినా, పార్లమెంట్లో రైతు సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారని భావిస్తే, కేంద్రం దానిపై కూడా దృష్టి సారించడం లేదన్నారు. ప్రతిరోజూ కూడా అటు లోక్ సభలో.. ఇటు రాజ్యసభలో అందరూ ఎంపీలం ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. లోక్ సభ లో కానీ రాజ్యసభలో కానీ ఏదో ఒక్క సభలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే, తమ డిమాండు కేంద్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఒక పక్క పండించిన ధాన్యం కొనక, మరొక పక్క రాబోయే కాలంలో ఏ పంట వేయాలో తెలియక తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతుందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పంట కొనుగోలుపై ఒక్కొ బీజేపీ నేత ఒక్కో విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా లోక్ సభలో లోపల, బయటా ఆందోళనలు చేస్తున్నామని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు గురువారం నాడు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి రైతు సమస్యలను వివరిస్తున్న క్రమంలో మైక్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్ కట్ చేసినంత మాత్రాన తమ గొంతు నొక్కలేరని ఆయన చెప్పారు. సభలో తాను తెలంగాణ రైతుల డిమాండ్ను లేవనెత్తే క్రమంలో టీ బీజేపీ నేతలు అనరాని మాటలు పార్లమెంట్ సాక్షిగా తమను అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల కోసం వాటన్నింటిని భరించామన్నారు. ఈ క్రమంలోనే లోక్ సభలో, రాజ్యసభలో వాకౌట్ చేసి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసినట్లు తెలిపారు. కనీస బాధ్యతగా తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సమావేశం పెడితే అందులో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని లేదా కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పార్లమెంట్లో సంబంధిత మంత్రి ద్వారా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రతా, ఎఫ్ సీ ఐ సేకరణ, రైల్వేకు సంబంధించిన అంశాలన్ని కేంద్రం పరిధిలోనే ఉంటాయనే విషయాన్ని తెలంగాణ రైతు సోదరులు గమనించాలన్నారు. కేంద్రం అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెడుతుందన్నారు. పండించిన పంటను కొనకపోవడం, కావాల్సినన్ని రైల్వే ర్యాక్లను ఏర్పాటు చేయకపోవడం, ఎఫ్ సీ ఐ కావాల్సిన మానవ వనరులను అందించడంలోనూ వివక్ష చూపిస్తున్నారన్నారు. ఏడు సంవత్సరాలలో నీళ్లు ఇచ్చి, కరెంటు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతు సోదరులకు న్యాయం జరిగే విషయంలో ప్రతి ఒక్కరూ తమతో కలిసి వచ్చి పోరాటానికి మద్దతు తెలపాలన్నారు. వారికి న్యాయం చేకూరేంత వరకు పోరాటం ఆపేది లేదని మరోమారు స్పష్టం చేశారు. ఎందుకంటే, ధాన్యం సేకరించే బాధ్యత కేంద్రానిదే అని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here