Spread the love
సీఎం కెసిఆర్‌ను కలిసిన కొత్త ఎంపీ వద్దిరాజు
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని ప్రగతి భవన్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలుపుతున్న వద్దిరాజు రవిచంద్ర. నేడు రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ వేసిన అనంతరం, సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్జతలు తెలుపుతున్న.. దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి . ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వర్ రావు ,ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు విప్ రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్ రావు, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర్ రావు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.