టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్.ర‌మ‌ణ

0
92
Spread the love

టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్.ర‌మ‌ణ

హైద‌రాబాద్ జూలై 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: తెలంగాణ టీడీపీ మాజీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీ చేరారు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో ఎల్ ర‌మ‌ణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి కేటీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ ర‌మ‌ణ‌.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు కేటీఆర్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, గంగుల క‌మ‌లాక‌ర్‌తో పాటు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు. కాగా, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here