రావుల చంద్రశేఖర్‌రెడ్డికి తెలంగాణ టీడీపీ చీఫ్ ప‌దవి ?

0
64
Spread the love

పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డికి తెలంగాణ టీడీపీ చీఫ్ గా అవకాశం లభిస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ పార్టీ ఫిరాయించడంతో ఇప్పుడు కొత్త బాస్ ఎవరన్న అంశంపై టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ చీఫ్ పదవి సీనియర్ నేతకు ఇవ్వాలా..? లేక దూకుడుగా ఉండే నేతకు అప్పగించాలా..? అని చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో చంద్రబాబు వర్చువల్ సమావేశాలు జరిపి అభిప్రాయాలు సేకరించారు. మెజార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు సూచించినట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here