జమీన్ ఔర్ మకాన్ ఆందోళన్ కు సిద్ధం కండి

0
123
Spread the love

జమీన్ ఔర్ మకాన్ ఆందోళన్ కు సిద్ధం కండి

-టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విరాహత్ అలీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పలువురు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి యేండ్లు గడుస్తున్నా స్థలాలు అప్పగించకపోవడం, కొన్ని చోట్ల స్థలాలు అప్పగించిన జర్నలిస్టుల నుండి తిరిగి వాటిని లాక్కోవడం సహించారనిదని, దీనికోసం జమీన్ ఔర్ మకాన్ ఆందోళన్ కు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ పిలుపు నిచ్చారు.
సోమవారం నాడు మేడ్చల్ లోని సాయి గార్డెన్స్ లో జిల్లా అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మేడ్చల్ పట్టణంలో 35మంది జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ భూమిని కేటాయించగా, దాదాపు 40 లక్షలు తమ జేబుల నుండి ఖర్చు చేసుకొని రాళ్లు, రప్పలను తొలగించి సదరు భూమిని జర్నలిస్టు లబ్ధిదారులు చదును చేసుకున్నారని విరాహత్ తెలిపారు. అంతేకాకుండా అట్టి స్థలంలో ఇళ్లను సైతం నిర్మించుకోగా రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేసి ఆ స్థలాన్ని వారి ఆధీనంలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం జర్నలిస్టులు మంత్రి మల్లారెడ్డిని కలిసినా అతను నోరు మెదపక పోవడం బట్టి చూస్తే తెరవెనుక ఇచ్చిన అదేశాలతోనే రెవెన్యూ అధికారులు ఈ దౌర్జన్యానికి పాల్పడినట్లు అర్థమై పోతుందన్నారు. అలాగే షామిర్ పేట, మల్కాజ్ గిరి, ఆల్వాల్, ఉప్పల్, బొడుప్పల్, నాచారం, కూకట్ పల్లి ప్రాంతాలకు చెందిన దాదాపు 200మంది జర్నలిస్టులకు 2008లో పట్టాలు ఇచ్చినా ఇంతవరకు స్థలాలు అప్పగించలేదని, ఎన్నో సార్లు మంత్రి మల్లారెడ్డిని కలిసినా అతను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇంటి స్థలాలు, ఇండ్ల కోసం త్వరలో పోరాటానికి సిద్ధం కావాలని విరాహత్ పిలుపునిచ్చారు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.వెంకట్ రెడ్డి, జి.బాల్ రాజ్ లు మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షపాతిగా ఉన్న తమ సంఘం నిరంతరం వారి సంక్షేమం కోసం పోరాడుతుందన్నారు. జిల్లాలో సుమారు 500 సభ్యత్వాల సేకరణ పూర్తయిందని వారు తెలిపారు.
14న, జిల్లా మహాసభ
—————————-
సెప్టెంబర్ 14న, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మహాసభను శామీర్ పేటలో నిర్వహించేందుకు జిల్లా కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో పాటు జిల్లా జర్నలిస్టుల సంక్షేమానికి పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here