గ్యాస్ వినియోగ‌దారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు

0
217
Spread the love

గ్యాస్ వినియోగ‌దారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు

     ఇక గ్యాస్  రీఫిల్‌ను ఏ పంపిణీదారుడి నుండి తీసుకోవచ్చు 

న్యూఢిల్లీ జూన్ 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: గ్యాస్ వినియోగ‌దారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు చెప్పింది. ఎల్పీజీ కస్టమర్‌లు తమ గ్యాస్ బండ‌ రీఫిల్‌ను ఏ పంపిణీదారుడి నుండి తీసుకోవాలో అన్న‌ది ఇక‌పై వారే నిర్ణ‌యించుకోవ‌చ్చు. హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌కు చెందిన గ్యాస్ రీఫిల్ పంపిణీ దారుల‌ను వినియోగ‌దారులు ఎంచుకొని గ్యాస్ బుక్ చేసుకోవ‌చ్చు. ఈ కొత్త స‌దుపాయాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు కేంద్ర‌ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. చండీగ‌ఢ్‌, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలో తొలుత పైలట్ దశలో అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here