గ్రీన్ ఛాలెంజ్ మొక్క‌లు నాటిన ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌

0
156
Spread the love

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా గండి పెట్ రోడ్ లోని తారమతి భారదారి లో మొక్కలు నాటిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ….

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలుపుతూ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ తారమతి భారదారి లో మొక్కలు నాటిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా…అనంతరం ( టూరిజం సెక్రటరీ శ్రీనివాస్ రాజు , మనోహర్ రావు ఎం.డి టూరిజం , ఈ డి శంకర్ రెడ్డి ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here