*రెండో రోజు ముమ్మరంగా సాగిన వ్యాక్సినేషన్ కార్యక్రమం*

0
69
Spread the love

*రెండో రోజు ముమ్మరంగా సాగిన వ్యాక్సినేషన్ కార్యక్రమం*

*హైదరాబాద్, ఆగస్టు 24:*
   18 ఏళ్లకు పైబడ్డ వారికి వంద శాతం కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిచేసేందుకై గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో రోజైన మంగళవారం ముమ్మరంగా కొనసాగింది. దాదాపు 175 వ్యాక్సిన్ బృందాలు తమకు కేటాయించిన కాలనీలకు ఉదయం 8గంటలకు చేరుకొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారాన్ని పోల్చితే నేడు వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగింది. నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు తమ పరిధిలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మెహిదీపట్నంలోని నానల్ నగర్ కాలనీ, అయోద్యగనర్, ప్రేమ్ రెడ్డి కాలనీ లను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. బంజారాహిల్స్  ఫోటోగ్రాఫర్స్ కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఎల్బీనగర్ శాసన సభ్యులు డి.సుధీర్ రెడ్డి హయత్ నగర్ సర్కిల్ లోని జడ్జస్ కాలనీ, సహారా ఎస్టేట్స్ తదితర కాలనీలను సందర్శించి ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఉప్పల్ శాసన సభ్యులు బి.సుభాష్ రెడ్డి, అంబర్ పేట్ శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ తమ పరిధిలోని వివిధ కాలనీలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here