డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

0
83
Spread the love

డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ మే 26 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలో పీఎం సురక్ష జీవన్ జ్యోతి, పీఎం సురక్ష భీమా, సుకన్య సమృద్ధి పథకాల పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్చంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సాయం చేయాలన్నారు. కరోనా మరణం, సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారేందరికే పీఎం భీమా యోజన అందుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం  కరోనాతో చనిపోతున్న వారికి కూడా పీఎం ఇన్సూరెన్స్ వర్తింపజేస్తుందన్నారు. సుకన్య సమృద్ధి గర్ల్ చైల్డ్‌కు బంగారు భవిష్యత్తు ఇస్తుందని…దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here