దృఢ స‌మాజానికి సోపానాలు – వేదాలు

0
602
Spread the love

దృఢ స‌మాజానికి సోపానాలు – వేదాలు
సంప్ర‌దాయ బ‌ద్ధంగా శ్రీ స‌త్య‌శివ గురుకుల వేద పాఠ‌శాల ప్రారంభం

 

జీవ‌న విధానాన్ని విశ‌దీక‌రించి, శాశ్వ‌త ఆనంద ప్రాప్తిని క‌లిగించే సామ‌ర్థ్యం కేవ‌లం వేదాల‌కు మాత్ర‌మే ఉంద‌ని రాష్ట్రప‌తి పుర‌స్కార గ్ర‌హీత‌, వేద భాష్య ర‌త్నం, శ్రీ శంక‌ర గురుకుల వేద పాఠ‌శాల మేనేజింగ్ ట్రస్టీ బ్ర‌హ్మ‌శ్రీ వేంక‌ట‌రామ ఘ‌నాపాఠి పేర్కొన్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ మైలార్‌దేవ్‌ప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌గ‌తి కాల‌నీలో శ్రీ స‌త్య‌శివ గురుకుల వేద పాఠ‌శాల ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ గురుకుల‌ వేద పాఠ‌శాల‌ను ఆయ‌న ప్రారంభించి, ప్ర‌సంగించారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం వేద భాష్య విభాగాధిప‌తి, సాంగ స్వాధ్యాయ భాస్క‌ర బిరుదాంకితులు బ్ర‌హ్మ‌శ్రీ‌ ప్ర‌వారామ‌కృష్ణ సోమ‌యాజి ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి, ప్రసంగించారు. పాపాల‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేయ‌డం వేద‌మున‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు.

కంప్యూట‌ర్ సామ‌ర్థ్య‌మును నిర్ణ‌యించే ప్రాసెస‌ర్ వంటిదే వేద‌మ‌ని, వేద‌శాస్త్ర‌ములు ఎంత దృఢంగా ఉంటే స‌మాజం అంత ఉన్నంతంగా ఉంటుంద‌ని శ్రీ స‌త్య శివ గురుకుల వేద పాఠ‌శాల మేనేజింగ్ ట్ర‌స్టీ బ్ర‌హ్మ‌శ్రీ ర‌మాకాంత శ‌ర్మ అభివ‌ర్ణించారు. ఎలాంటి వ్యాప‌ర ధోర‌ణుల‌కు తావివ్వ‌కుండా, పూర్తి ఉచితంగా, స‌నాత‌న సంప్ర‌దాయ గురుకుల విధానాల‌ను పాటిస్తూ, ప‌రిపూర్ణ వేద పండితులుగా తీర్చిదిద్ద‌డం త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. విద్యార్థి ప్ర‌వేశించినది మొద‌లుకొని, వేద‌పండితునిగా మార్చే వ‌ర‌కు సంపూర్ణ బాధ్య‌త‌ను తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న హామీ ఇచ్చారు. శ్రీ స‌త్య‌శివ గురుకుల వేద పాఠ‌శాల ప్రారంభోత్స‌వానికి సంచాల‌క‌త్వం వ‌హించిన పాఠ‌శాల ట్రస్టీ ఆచ‌ర్య బ్ర‌హ్మ‌శ్రీ పంతంగి వేంక‌టేశ్వ‌ర నాగాదిత్య శ‌ర్మ గురు వైభ‌వాన్ని అద్భుత రీతిలో వివ‌రించారు. వేద శాస్త్ర అభిమానులు పెద్ద సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here