గణేష్ ఉత్సవాలను ఏకాభిప్రాయం తో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం

0
123
Spread the love

కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఏకాభిప్రాయం తో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత న సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. కరోనా నేపధ్యంలో ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి అనే విషయంపై సమావేశంలో పలువురు ఉత్సవ సమితి సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ సమావేశంలో హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి శ్రీ సబితా ఇంద్రారెడ్డి, DGP శ్రీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అరవింద్ కుమార్,దేవాదాయ శాఖ కార్యదర్శి అనీల్ కుమార్, mlc లు ప్రభాకర్, రాంచందర్, mla లు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్, రాజాసింగ్, సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, కలెక్టర్లు శ్వేతా మహంతి, వాసం వెంకటేశ్వర్లు, ghmc కమిషనర్ లోకేష్ కుమార్, ఆడిషనల్ DGP జితేందర్, పోలీస్ కమిషనర్ లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భాగవంతరావు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, బాలా పూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, విగ్రహాల ప్రతిష్ట నుండి నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. Ghmc పరిధిలో సుమారు లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఆచారాలు, సాంప్రదాయాలను గౌరవిస్తుందని, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాలు చర్చించడం కోసమే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని, దానిని దృష్టిలో ఉంచుకొని 4 రోజులలో మరో సమావేశం నిర్వహించిన అనంతరం ఏకాభిప్రాయం తో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here