గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

0
79
Spread the love

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు

విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చింది. షడ్భుజి రూపంలో అమ్మవారి అవతారాన్ని అలంకార భట్టర్లు తీర్చిదిద్దారు. రుద్రాక్షమాల, కమండలం, శూలం, ఢమరుకం, శంఖుచక్రాలు, పాశాంకుశాలు చేతపట్టి భక్తులను అనుగ్రహించింది అమ్మవారు. విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టును నాటారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here