ఈవీఎం, వీవీప్యాట్‌ల‌పై చైత‌న్యానికై 58 అవ‌గాహ‌న కేంద్రాలు – దాన‌కిషోర్‌

0
456
Spread the love

ఈవీఎం, వీవీప్యాట్‌ల‌పై చైత‌న్యానికై 58 అవ‌గాహ‌న కేంద్రాలు – దాన‌కిషోర్‌

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్లు, వివిప్యాట్‌ల ఉప‌యోగంపై న‌గ‌ర ఓట‌ర్ల‌లో చైత‌న్యం క‌ల్పించ‌డానికి 58 ప్రాంతాల్లో అవ‌గాహ‌న కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలియ‌జేశారు. ఈవీఎంలు, వివిప్యాట్‌ల‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకుగాను ఏర్పాటు చేసిన 58 అవ‌గాహ‌న కేంద్రాల ఇన్‌చార్జీ అధికారి, పోలీస్ అధికారులతో దాన‌కిషోర్ స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హైద‌రాబాద్ జిల్లాలోని 15 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 48 ప్రాంతాల్లో శాశ్వ‌తంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల‌పై అవ‌గాహ‌న‌, చైత‌న్య కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. వీటితో పాటు ప్ర‌తి జోన్‌కు మూడు మొబైల్ మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్ల‌ను ప్రారంభించామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ తెలిపారు. ఈ 58 చైత‌న్య కేంద్రాల్లో ప్ర‌తి కేంద్రం వ‌ద్ద ర‌క్ష‌ణ‌గా ఇద్ద‌రు సాయుద పోలీసుల‌ను నియ‌మిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌తి కేంద్రం వ‌ద్ద జీహెచ్ఎంసీ సీనియ‌ర్ అధికారుల‌ను ప్ర‌త్యేకంగా నియ‌మిస్తున్నామ‌ని, ప్ర‌తిరోజు ఉద‌యం 11 గంట‌ల నుండి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు ఈ కేంద్రాల ద్వారా ఈవీఎం, వివిప్యాట్‌ల‌పై అవ‌గాహ‌న నిర్వ‌హించ‌నున్న‌ట్టు దాన‌కిషోర్ తెలిపారు. ఈ ఓటింగ్ యంత్రాలను ఉప‌యోగించే విధానంపై తెలుసుకునేందుకు అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌ర్చుకోవాల్సిందిగా న‌గ‌ర‌వాసులకు, ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.
*హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసే కేంద్రాలు*
ముషిరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజీవ్‌గాంధీన‌గ‌ర్ కమ్యునిటీహాల్‌, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌, తెల‌హబ‌స్తీ క‌మ్యునిటీహాల్‌, మ‌ల‌క్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గంలో సిరిపురం క‌మ్యునిటీహాల్‌, స‌లీమ్‌న‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌, షోహెబ్ మెమోరియ‌ల్ లైబ్ర‌రీ పార్కు, ఆస్మాన్‌ఘ‌డ్ ప‌ద్మావ‌తి క‌ల్యాణ మండపం. అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గంలోని అంబ‌ర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియం, కాచిగూడ హ‌ర్జ్‌పెంట వార్డు కార్యాల‌యం, విక్ర‌మ్ న‌గ‌ర్ పార్కు వార్డు ఆఫీస్‌. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నారాయ‌ణ‌గూడ కేశ‌వ్ మెమోరియ‌ల్ కామ‌ర్స్, సైన్స్‌ క‌ళాశాల‌, ఖైర‌తాబాద్ జోన‌ల్ కార్యాల‌యం, బంరాహిల్స్ రోడ్ నెం-7 మున్సిప‌ల్ వార్డు ఆఫీస్‌. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్ర‌గ‌డ్డ ఫాతిమాన‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌, యూసుఫ్‌గూడ వెంక‌ట‌గిరి క‌మ్యునిటీహాల్‌, బోర‌బండ వినాయ‌క‌రావున‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌. స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పాటిగ‌డ్డ మోడ‌ల్ మార్కెట్ క‌మ్యునిటీహాల్‌, బ‌న్సిలాల్‌పేట్ సీసీన‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌, ఎస్సార్‌న‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌. నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గుడిమ‌ల్కాపూర్ న‌వోద‌య క‌మ్యునిటీహాల్‌, నాంప‌ల్లి జాకిర్ హుస్సేన్ క‌మ్యునిటీహాల్‌, అహ్మ‌ద్‌న‌గ‌ర్ బడా బ‌జార్ క‌మ్యునిటీహాల్‌, బ‌జార్‌ఘాట్ వార్డు ఆఫీస్‌. కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలో కార్వాన్ వార్డు నెంబ‌ర్ 13 కార్యాల‌యం, గోల్కొండ 9వ వార్డు కార్యాల‌యం, టోలిచౌకి ఎంసిహెచ్ కాల‌నీ 9వ వార్డు కార్యాల‌యం. గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని దూత్‌ఖానా బేగంబ‌జార్ వార్డు ఆఫీస్‌, మంగ‌ళ‌హాట్ ర‌హీంపుర ప్లేగ్రౌండ్‌, జాంబాగ్ ఫిరోజ్ గాంధీ పార్కు. చార్మినార్ నియోజ‌క‌వ‌ర్గంలోని మొగ‌ల్‌పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, సర్దార్‌మ‌హ‌ల్ జీహెచ్ఎంసీ కార్యాల‌యం, పేట్ల‌బుర్జు జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్‌. చాంద్రాయ‌ణ‌గుట్ట నియోజ‌క‌వ‌ర్గంలో ర‌క్ష‌పుర మోడ‌ల్ మార్కెట్‌, జంగంమెట్టు జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్‌, హ‌ఫీజ్‌బాబాన‌గ‌ర్ జీహెచ్ఎంసీ క‌మ్యునిటీహాల్‌. యాక‌త్‌పుర నియోజ‌క‌వ‌ర్గంలో సింగ‌రేణి కాల‌నీ స‌హ‌కార సంఘం భవ‌నం, సంతోష్‌న‌గ‌ర్ మ‌స్క‌టి ప్లేగ్రౌండ్ క‌మ్యునిటీహాల్‌, గౌలిపుర‌లోని మిత్ర‌క్ల‌బ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, ఎస్‌.ఆర్‌.టి కాల‌నీలోని జీహెచ్ఎంసీ క‌మ్యునిటీహాల్‌. బ‌హ‌దూర్‌పుర నియోజ‌క‌వ‌ర్గంలోని చందులాల్ బ‌రాదారి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, ఫ‌ల‌క్‌నూమా సర్ఫ‌రాజ్‌జంగ్ కాల‌నీ వార్డు ఆఫీస్‌, రాంనాస్‌పుర వార్డు ఆఫీస్‌. సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని బౌద్ద‌న‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌, తార్నాక నాగుర్జున‌న‌గ‌ర్ క‌మ్యునిటీహాల్‌, అడ్డ‌గుట్ట జ‌గ్జీవ‌న్‌రామ్ క‌మ్యునిటీహాల్‌, సికింద్రాబాద్ క‌టోన్మెంట్‌లో బోయిన్‌ప‌ల్లి కంటోన్మెంట్ బోర్డు స‌ర్కిల్ ఆఫీస్‌, మ‌డ్‌ఫోడ్ కంటోన్మెంట్ బోర్డువ‌ర్క్ షాప్‌, కంటోన్మెంట్ బోర్డు ప్ర‌ధాన కార్యాల‌యం, బోల్లారం కంటోన్మెంట్ బోర్డు స‌ర్కిల్ ఆఫీస్‌ల‌తో పాటు జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈవీఎం, వివిప్యాట్‌ల చైత‌న్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here