*ఓట‌రు ఫ్రెండ్లీగా పోలింగ్ స్టేష‌న్ల ఏర్పాటు – దాన‌కిషోర్‌*

0
419
Spread the love

*ఓట‌రు ఫ్రెండ్లీగా పోలింగ్ స్టేష‌న్ల ఏర్పాటు – దాన‌కిషోర్‌*

రానున్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా పోలింగ్ కేంద్రాల్లో క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను విధిగా క‌ల్పించాల‌ని రిట‌ర్నింగ్ అధికారుల‌కు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఆదేశించారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌ను ఓట‌ర్ ఫ్రెండ్లీ పోలింగ్ స్టేష‌న్‌గా రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్ ప్ర‌వేశ‌ద్వారం స‌క్ర‌మంగా ఉండాల‌ని, దివ్యాంగుల‌కు ఏర్పాటుచేసే ప్ర‌త్యేక ఏర్పాట్ల‌లో భాగంగా ర్యాంప్‌ల నిర్మాణం చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. వీటితో పాటు త్రాగునీటి సౌక‌ర్యం, విద్యుత్ స‌ర‌ఫ‌రా, త‌గు ఫ‌ర్నీచ‌ర్‌, టాయిలెట్ల సౌక‌ర్యం, ఓట‌ర్లు వేచి ఉండ‌డానికి షెడ్‌ల ఏర్పాటు లేదా వెయిటింగ్ రూమ్ సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. వీటితో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా దివ్యాంగులు సుల‌భంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకుగాను పోలింగ్ స్టేష‌న్‌ను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ర్యాంప్‌ల నిర్మాణం, దివ్యాంగులు వెంట‌నే పోలింగ్ బూత్‌ల‌కు చేరుకునేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు, పార్కింగ్ వ‌స‌తి ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో దివ్యాంగుల‌కు సౌక‌ర్యాలు అయిన వీల్‌ఛైర్‌ల ఏర్పాటు, బ్రెయిలీ బ్యాలెట్లు, బ్లైండ్ పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లో అద‌న‌పు పోలింగ్ స్టేష‌న్లు, లెప్ర‌సి కాల‌నీలు, అద‌న‌పు పోలింగ్ స్టేష‌న్‌ల ఏర్పాటు త‌దిత‌ర స‌మాచారానికి సంబంధించి బూత్‌స్థాయి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని దాన‌కిషోర్ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here