వరంగల్ నగరానికి తలమానికంగా భద్రకాళి బండ్

0
226
Spread the love

వరంగల్ నగరానికి తలమానికంగా భద్రకాళి బండ్

భద్రకాళి ట్యాంక్ బండ్ ను, బయోడైవర్సిటీ(కల్చరర్ పార్క్) ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖల మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు*

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వరంగల్ (GWMC)26 సెప్టెంబర్ 2021:

నగరానికి తలమానికంగా భద్రకాళి బండ్ నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు.
ఆదివారం ఆజాదికా అమృతోత్సవ్ కార్యక్రమం లో భాగం గా మహా నగర పాలక సంస్థ,కుడా సంయుక్తం గా భద్రకాళి (ట్యాంక్ బండ్) పై ప్రజల సందర్శనార్థం నిర్మించిన బయో డైవర్సిటీ కల్చరర్ పార్క్ ను ప్రజల సందర్శనార్థం మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ రూ.30 కోట్ల అంచనా వ్యయం తో బండ్ ను నిర్మించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం లో ఈ బండ్ ను చాలా అద్బుతం గా నిర్మించారని,
కాకతీయుల కాలం నాటి ఈ కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, రామప్ప ఆలయానికి ఇటీవల ప్రపంచ వారసత్వ హోదా దక్కిందని ఇందుకోసం ముఖ్యమంత్రి కేసి ఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఖిలవారంగల్,వెయ్యి స్తంభాల ఆలయం, లక్నవరం వంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

రూ.2500 కోట్ల తో వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి చేయడం జరుగురున్నదని తెలిపారు.
ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన నల్లా నీరు అందజేయడానికి రూ.998 కోట్లు వెచ్చించి నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, కరోనా సమయంలో ఆర్థిక మాంద్యం ఉన్నపటికీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం జరిగిందని తెలిపారు.
బండ్ ను అద్భుతంగా తీర్చిదిద్దుటలో కృషి చేసిన జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్ లకు మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్
దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హైద్రాబాద్ తర్వాత వరంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చూస్తున్నారని అన్నారు. చారిత్రాత్మక వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో భద్రకాళి బండ్ అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
దేశానికి స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా
అజాధికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సోమవారం నుండి సందర్శకులకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. సి ఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న జిల్లాను బండ్ ఏర్పాటుతో టూరిజం హబ్ గా, కల్చరల్ హబ్ గా తీర్చిదిద్దుటకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్ మాట్లాడుతూ భద్రకాళీ బండ్ ను అద్భుతంగా నిర్మించారని, ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహాళ్లడం కూడా కలుగుతుందని అన్నారు.
చారిత్రాత్మక వరంగల్ నగరంలో భద్రకాళి బండ్ తో పాటు కాకతీయుల వారసత్వ
వేయింస్తంబాల దేవాలయం లో రూ 7 కోట్లతో కళ్యాణ మండపం నవీకరణ, ఖిలా వరంగల్ లోని 12 ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

వరంగల్ కాకతీయుల మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.
కాకతీయుల వారసత్వన్స సంపద ను పరిరక్షిస్తున్నట్లు తెలిపారు.
హైద్రాబాద్ నుండి వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు అయిందన్నారు ,
కైటేక్స్ ఏర్పాటు తో ఎంతో మందికి పెద్దఎత్తున ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు.

నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ హృదయ, అమృత్ స్మార్ట్ సిటీ నిధులతో బండ్ పై ఏర్పాటు వేకింగ్ ట్రాక్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరిగిందన్నారు. వాకింగ్ ప్రేమికులు ప్రత్యేకంగా ఉదయం సాయంత్ర వేళల్లో వాకింగ్ చేసుకోనేలా అనుమతించడం జరుగుతుందని అన్నారు.
యునెస్కో లో రామప్ప రావడం జరిగిన నేపద్యంలో పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

అనంతరం స్వాతంత్ర్యం సాధించి
75 సంవత్సరాల పూర్తి సందర్భంగా అజాదిగా అమృత్ మహోత్సవాల్లో భాగాంగా బల్దియా ఆధ్వర్యంలో బండ్ పై మహిళలతో వాక్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు, సిపి డాక్టర్ తరుణ్ జోషి, జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య, కుడా, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here