మెడికల్ హబ్ గా చారిత్రక నగరం వరంగల్

0
141
Spread the love

మెడికల్ హబ్ గా చారిత్రక నగరం వరంగల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రూ.1100 కోట్ల పరిపాలనా అనుమతులు

పేదలకు మెరుగైన వైద్యం లక్ష్యంగా ప్రభుత్వ ఆరోగ్యరంగం పటిష్టం

గౌరవ సిఎం కేసిఆర్, మంత్రులు కేటిఆర్, హరీష్ రావులకు ధన్యవాదాలు

రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

(హైదరాబాద్, డిసెంబర్ 04)
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 1100 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు రావడంతో చారిత్రక వరంగల్ నగరం మెడికల్ హబ్ గా అవతరించబోతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వైద్యారోగ్య రంగం పటిష్టం అవుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న మంత్రులు కేటిఆర్, హరీష్ రావు గారికి వరంగల్ ప్రజల పక్షాన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అధునాతన వైద్య సదుపాయాలతో వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అద్భుతమైన హాస్పిటల్ కోసం డిజైన్లు రూపొందించి, దాని నిర్మాణం కోసం 1100 కోట్ల రూపాయలకు అనుమతులు ఇవ్వడం ఇక్కడి ప్రజల పట్ల సిఎం గారికి ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ 158 జీవోలో సివిల్ వర్క్స్ కు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధులకు అనుమతులు ఇవ్వడం పట్ల మరోసారి ధన్యవాదాలు తెలిపారు. అత్యంత వేగంగా ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు చేయాలని ఆదేశించడంతో…త్వరలోనే ఓరుగల్లు ప్రజలకు ఉత్తమమైన వైద్యం అందుబాటులోకి రానుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here