పోలీసుల సహకారం ఎప్పుడు వుంటుంది -వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

0
108
Spread the love

పోలీసుల సహకారం ఎప్పుడు వుంటుంది

-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

కోవిడ్ వ్యాధి బారిన పడకుండా ట్రాన్స్ జెండర్స్ వైద్యపరంగా పూర్తి సహకారం వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రాన్స్ జెండర్స్ సూచించారు.

మీల్స్ కాలనీ పోలీసుల అధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లకు నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కరీమాబాద్లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హజరయి కరీమాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న ట్రాన్సజెండర్స్ కుటుంబాలకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా నిత్యవసర వస్తువుల పంపిణీ చేసారు. లాక్డౌన్ వేళ ఇబ్బందులకు గురౌవుతున్న ట్రాన్స్ జెండర్స్ ఇబ్బందులకు స్పందించిన మీల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ రవికిరణ్ ట్రాన్స్ జెండర్లకు నిత్యవసర వస్తువులను అందజేసేందుకు ముందురావడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ విపత్తుకర సమయాల్లో మీరందరు ధైర్యంతో వుండాలని, ఈసమయంలో మీలో ఎవరు కరోనా వ్యాధికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం వుందని, అదే విధంగా లాక్ డౌన్ సమయంలో స్వీయ నిర్బంధం వుండటం ప్రతి ఒక్కరికి క్షేమకరమని, ఎవరికైన కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి, పాజిటివ్ తెలివాళ్ళు మెరుగైన వైద్యం తీసుకోవాలని, ముఖ్యంగా చికిత్సపరంగా ఎదైన సమస్యలు వుంటే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వ్యాధిగురైన వారిని యం.జి.యం వైద్యం అందించబడుతుందని, అలాగే ప్రతి ఒక్కరు తప్పని వ్యాక్సీనేషన్ చేసుకోవాల్సి వుంటుంది. ఈ వ్యాక్సీనేషన్ పై అనుమానాలు పెట్టుకోవద్దని, మీరందర్ వ్యాక్సీనేషన్ చేయించుకోనేందుకు ఇబ్బందులకు గురైయితే అధికారులతో మాట్లాడి ప్రత్యేక మీరందరి కోసం ప్రత్యేకంగా వ్యాక్సీనేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఈ ఎలాంటి అవసరాలు వున్న మీ కాలనీ ఇన్ స్పెక్టర్ దృష్టికి తీసురావల్సిందిగా పోలీస్ కమిషనర్ తెలియజేసారు. అనంతరం ట్రాన్స్ జెండర్స్ ప్రతినిధి లైలా వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసారు.
ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా,వరంగల్ ఎ.సి.పి గిరికుమార్, ఆర్మూడ్ రిజర్వ్ ఎ.సి.పి సదానందం, మీ కాలనీ ఇన్ స్పెక్టర్ రవికిరణ్, ఎస్.ఐ సతీష్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Watch Video News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here