లాక్ డౌన్ వేళ ఆకాశంలో
డ్రోన్ చక్కర్లు…వాహనదారులారా జరభద్రం….
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా డౌనను మరింత పతిష్టంగా అమలు చేసేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం నగరంలో మరిన్ని డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించింది. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఆదేశాల మేరకు ప్రధాన రోడ్డు మార్గాలోనే కాకుండా గల్లీలోను ఎలాంటి కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చే వాహనాలతో పాటు ప్రజలను గుర్తించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని డివిజన్ల పరిధిలో పోలీసులు డ్రోన్ల వినియోగించడం ప్రారంభించారు. ఇందులో భాగంగా హన్మకొండ సబ్ డివిజన్ పరిధిలో రోడ్లపై వాహనాలను గుర్తించేందుకుగా అత్యాధునికమైన డ్రోన్లను హన్మకొండ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రోన్ ద్వారా సుమారు 4కిలో మీటర్ల పరిధిలోని వాహనాలను మనుషులను గుర్తించడంతో పాటు వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించడం చాలా సులభంగా దీని ద్వారా రోడ్లపై తిరిగే వాహనాలను గుర్తించి వాటిపై జరిమానాలను విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇందుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము జంక్షన్ వద్ద వుంది ములుగు జంక్షన్లో వద్ద జరిగే కార్యాకలపాలపై పర్యవేక్షించడంతో పాటు రోడ్లపై తిరిగే వాహనాల సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ల పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా లాకౌన్ వేళల్లో పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ వినియోగాన్ని తప్పనిసరిగా చేయాల్సి వుంటుందని. డ్రోన్ల ద్వారా గుర్తించిన వాహనాలపై జరిమానాలు విధించడంతో పాటు అవసరం అనుకుంటే వాటిని సీజ్ చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ అధికారులకు అదేశించారు.
ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, హన్మకొండ ఎ.సి.పి జితేందర్‌తో పాటు డ్రోన్ ఆపరేటర్ సూరజ్ పాల్గొన్నారు.