ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మా లక్ష్యం కాదు
-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
లా డౌన్ వేళ అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారుల వాహనాలను సీజ్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం మా లక్ష్యం కాదని ప్రజలు కరోనా వ్యాధికి గురికాకుండా కుటుంబంతో సంతోషంగా వుండాలనదే పోలీసుల ఉద్యేశమని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుజోషి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిష్టంగా లాక్ డౌన్ కోనసాగుతోంది. రాష్ట్ర పోలీస్ బాస్ ఇచ్చిన సూచనలతో వరంగల్ కమిషనరేట్ పోలీసులు మరింత వేగం పెంచారు. ఇందులో భాగంగా సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ బోన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెకపోస్టుల వద్ద మరింత సిబ్బందిని పెంపొందించడంతో పాటు, లా నన్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకుగాను రోడ్ల మీదకు వచ్చే వాహనదారులను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో పాటు, వాహనదారులు చూపించే వైద్య మరియు అనుమతి పత్రాలను పోలీసులు నిషితంగా పరిశీలించడంతో పాటు తప్పుడు పత్రాలతో రోడ్ల మీదుకు వచ్చిన వాహనదారులకు చెందిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తూ ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులపై పోలీసులు కోరడా ఝళిపించారు. లా డౌన్ ప్రకటించిన నాటి నుండి పోలీసులు ఇప్పటి వరకు సూమారు 23వేల వాహనాలపై కేసులను నమోదు చేసి సుమారు కోటి రూపాయలకు పైగా జరిమానాలు విధించడం జరిగింది. అదే విధంగా గత మూడు రోజుల నుండి వేగం పెంచిన పోలీసులు ఇప్పటి వరకు 559 వాహనాలను పోలీసులు సీజ్ చేసి పోలీసు స్టేషన్లకు తరిలించారు. ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 238, ఈస్ట్ జోన్(వరంగల్ రూరల్ ల్లా) 162, వెస్టన్(జనగాం జిల్లా)లో 159 వాహనాలను పోలీసులు సీజ్ చేసారు. అదే విధంగా లాక్ డౌన్ నిబంధనలను సంబంధించి 8వేలకు పైగా కేసులను పోలీసులు నమోదు చేశారు.
ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో క్షేత్ర స్థాయిలో పోలీస్ చెక్ పోస్టుల వద్ద పోలీస్ కమిషనర్ తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పోలీస్ కమిషనర్ ఎలాంటి పత్రాలు లేకుండా రోడ్ల మీదకు అనవసరంగా వచ్చిన వాహనాలను పోలీస్ కమిషనర్ సీజ్ చేసిన పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మరింత లాక్ డౌన్ మరింత పటిష్టంగా ఆమలు చేయడం జరుగుతుందని, ఇందుకోసం ప్రధాన మార్గాలకు అనుసంధామైన రోడ్డు మార్గాల్లోను ముమ్మరంగా పెట్రోలింగ్, తనీఖీలు నిర్వహించబడటంతో పాటు పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడబడుతుందని, ఇకనైనా వాహనదారులు అనవసరంగా రోడ్లమీదకు రావద్దని, ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వస్తే చిక్కుల్లో పడుతారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీలో సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, వరంగల్, హన్మకొండ,ట్రాఫిక్ ఎ.సి.పిలు జితేందర్ రెడ్డి, గిరికుమార్, బాలస్వామి, ఇన్ స్పెక్టర్లు చంద్రశేకర్ గౌడ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సతీష్ బాబుతో ఇతర సిబ్బంది పాల్గొన్నారు.