Spread the love
అనవసరంగా రోడ్డు మీదకు వస్తే వాహనం సీజ్
లాక్ డౌన్ సమయంలో వాహనదారులు ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ప్రజలకు సూచించారు.
లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నిన్నటి రోజున అధికారులతో నిర్వహించిన సమావేశంలో సూచించడంతో శనివారం వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనీఖీలు నిర్వహించారు. ఈ తనీఖీల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ హన్మకొండ మిషన్ హస్పటల్ వద్ద అకస్మికంగా తనీఖీ నిర్వహించారు. తనీఖీల్లో భాగంగా ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వాహనాలతో పాటు తప్పుడు పత్రాలతో వచ్చిన వాహనదారులపై పోలీస్ కమిషనర్ అగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేయాల్సింది పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను అదేశారు.