పోలీస్ స్టేషన్ల అవరణలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వండి

0
270
Spread the love

పోలీస్ స్టేషన్ల అవరణలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వండి

-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అవరణలో ఆహ్లాదకరమైన వాతవరణం కోసం ముమ్మరం మొక్కల పెంపకాన్ని చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం పిలుపునందుకోని పల్లె ప్రగతి…పట్టణ ప్రగతి… కార్యక్రమములో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో పరేడ్ మైదానంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనరేట్ కార్యాలయములో పని సిబ్బందితో పాటు వివిధ పనులకోసం కార్యాలయమునకు సందర్శించే ప్రజలకు కమిషనరేట్ కార్యాలయము మరింత ఆహ్లాదకరం కనిపించే విధంగా మొక్కల పెంపకంతో ముమ్మరం గా కొనసాగించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసారు. అనంతరం పోలీసు కమిషనర్ మాట్లాడుతూ మొక్కలను నాటడంతొ మన భాధ్యత తీరిపోదని, వాటిని నిరంతరం పరిరక్షించడం మనందరి బాధ్యతగా గుర్తించాలని, రానున్న రోజుల్లో మన వారసులకు స్వచ్చమైన వాతవరణాన్ని అందించాలంటే మొక్క పెంపకం తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here