జ‌నాభా పెరుగుద‌ల నియంత్ర‌ణ స‌మిష్టి బాధ్య‌త‌

0
55
Spread the love

జ‌నాభా పెరుగుద‌ల నియంత్ర‌ణ స‌మిష్టి బాధ్య‌త‌
– ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాల సంయుక్త కృషితోనే నిర్దేశిత ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకోగ‌లం
– ప్ర‌పంచ‌ జ‌నాభా దినం సంద‌ర్భంగా క్షేత్ర‌ప్ర‌చార విభాగం వ‌రంగ‌ల్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ వెబినార్‌లో ప్ర‌సంగించిన అద‌న‌పు డీఎంహెచ్ఓ డాక్ట‌ర్ మ‌ద‌న్‌మోహ‌న్ రావు
– జ‌నాభా పెరుగుద‌ల అరిక‌ట్టే విష‌యంలో యువ‌త కీల‌క పాత్ర పోషించాల‌ని సూచ‌న‌

వ‌రంగ‌ల్‌, జూలై 9, 2021ః
జ‌నాభా పెరుగుద‌ల నియంత్ర‌ణ‌ పౌర స‌మాజం, ప్ర‌భుత్వం యొక్క స‌మిష్టి కృషితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా అద‌న‌పు డీఎంహెచ్ఓ శ్రీ‌ డాక్ట‌ర్ మ‌ద‌న్‌మోహ‌న్ రావు తెలిపారు. అధిక‌ జ‌నాభా క‌లిగి ఉండ‌టం అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంద‌ని ప‌లు అంత‌ర్జాతీయ అధ్య‌య‌నాలు విశ్లేషించాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. జూలై 11వ తేదీన ప్ర‌పంచ‌ జ‌నాభా దినం సంద‌ర్భంగా క్షేత్ర ప్ర‌చార విభాగం వ‌రంగ‌ల్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన‌ వెబినార్‌లో వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా అద‌న‌పు డీఎంహెచ్ఓ డాక్ట‌ర్ మ‌ద‌న్‌మోహ‌న్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

జ‌నాభా విస్పోట‌నం వ‌ల్ల ప‌లు దేశాల్లో అభివృద్ధి కుంటుప‌డింద‌ని అనేక అంత‌ర్జాతీయ అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయ‌ని అద‌న‌పు డీఎంహెచ్ఓ డాక్ట‌ర్ మ‌ద‌న్‌మోహ‌న్ రావు ఈ సంద‌ర్భంగా ప‌లు ఉదాహ‌ర‌ణల‌తో స‌హా తెలియ‌జేశారు. భార‌త‌దేశంలో జ‌నాభా పెరుగుద‌ల‌పై నియంత్రణ అవ‌స‌ర‌మ‌ని ప‌లు అధ్య‌య‌నాలు పేర్కొంటున్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన అద‌న‌పు డీఎంహెచ్ఓ ఈ లక్ష్యాన్ని సాధించ‌డం ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాల సమిష్టి కృషితోనే సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. సంతాన సాఫల్య రేటు(టి.ఎఫ్. ఆర్) 2.4 నుంచి 1 కి తగ్గించాలనే ప్రభత్వ లక్ష్యం నెరవేరేందుకు ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ మదన్ మోహన్ కోరారు. కుటుంబానికి ఒక‌రే శిశువు అన్న సిద్ధాంతాన్ని ప్ర‌జ‌లు అవ‌లంభించాలని ఆయ‌న సూచించారు. జ‌నాభా పెరుగుద‌ల అరిక‌ట్టే విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ విభాగాల ద్వారా కల్పిస్తున్న అవ‌గాహ‌న‌తో చైత‌న్యం పొంది ఈ ల‌క్ష్య‌సాధన‌లో యువ‌త‌రం కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌నాభాను నియంత్రించేందుకు ప్ర‌భుత్వం చేప‌ట్టే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌ల స‌హ‌కారం ఉండాల‌ని పీఐబీ & ఆర్ఓబీ తెలంగాణ రాష్ట్ర డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి శృతి పాటిల్‌ అన్నారు. ఈ వెబినార్‌లో ఆర్ఓబీ డిప్యూటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here