పోలీసు సిబ్బందికి మాస్కులు… శానిటైజర్లును పంపిణీ చేసిన‌ వరంగల్ పోలీస్ కమిషనర్

0
172
Spread the love

పోలీసు సిబ్బందికి మాస్కులు… శానిటైజర్లును
పంపిణీ చేసిన‌ వరంగల్ పోలీస్ కమిషనర్

Toofandaily News (Warangal) వ‌రుస సేవా కార్యక్రమాలతో త‌న‌లోని దాతృత్వ గుణాన్ని చాటుకుంటున్నారు వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ డా. తరుణ్ జోషి. పోలీస్ అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా కనీస జాగ్రత్తలను పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆయ‌న సూచించారు. లాక్ డౌన్ సందర్భంగా చెక్ పోస్ట వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లును వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం అందజేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యలయము జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమములో లాక్ డౌన్ సందర్భంగా ట్రై సిటి పరిధిలోని వివిధ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా వ్యాధికి గురికాకుండా ముందస్తూ జాగ్రత్తల్లో భాగంగా పోలీస్ సిబ్బందికి అవసరమైన శానిటైజర్లు, మాస్కులను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పాతో పాటు మరికొంత మంది పోలీస్ సిబ్బంది అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు తమ వంతు భాధ్యతగా విధులు నిర్వహించడం అభినందనీయమని, ఈ విపత్కర పరిస్థితుల్లోను తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చెక్ పోస్ట్ వద్ద విధులను నిర్వహిస్తున్న పోలీసుల పట్ల ప్రజలకు గౌరవం పెరిగిందని, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా రెండు దోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఎ.ఆర్ ఎ.సి.లు గిరికుమార్, జితేందర్ రెడ్డి, రవీంద్రకుమార్, శ్రీనివాస్ తో పాటు ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here