క‌రోనా నేప‌థ్యంలో…..యాచ‌కుల‌ప‌ట్ల క‌రుణ చూపుతున్న‌ మ‌న వరంగల్ పోలీసులు

0
273
Spread the love

ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న అన్న విష‌యాన్ని చాటిబెబుతున్నారు మ‌న వ‌రంగ‌ల్ పోలీసులు. మనిషి చేసిన రాయి రప్పకి మహిమ గలదని మొక్కుతారు జ‌నం. మ‌రి మ‌నిషే మానత్వానికి నిలువుట‌ద్ఢంగా మారితే. అది క‌రుడు క‌ట్టిన ఖాకీ…. మాన‌వ‌సేవే మాధ‌వ సేవగా భావించి రంగంలోకి దిగితే….అది అంద‌రిలో స్ఫూర్తిని ర‌గిలిస్తుంద‌నడంలో ఏమాత్రం సందేహం లేదు. క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తున్న స‌మ‌యంలో ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు ఓరుగ‌ల్లు ర‌క్ష‌క్ష‌భ‌టులు. అదీ యాచ‌కులకు క‌రోనా ప‌రీక్షలు చేయించ‌డం ద్వారా త‌మ‌లో మాన‌వ‌త్వాన్నిచాటుకున్నారు… మ‌న ఖాకీలు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ మరియు వరంగల్ డివిజన్ పరిధిలోని యాచకులకు పోలీసుల అధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఈ రోజు నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అదేశాల మేరకు సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా అధ్వర్యంలో వరంగల్ బస్టాండ్ మరియు హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో సోమవారం పోలీసులు జిల్లా వైద్య విభాగం సహకారంతో సుమారు 150 మంది యాచకులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం తో పాటు వారికి పండ్ల మరియు మాస్క్ లను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. పరీక్షల అనంర‌తం యాచకులకు పోలీసులు భోజనం కూడా పెట్టారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కోరోనా నియంత్రించడంలో మనందరిపై భాధ్యత వుందని, ముఖ్యంగా కరోనా నియంత్రణ కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కరోనా నిర్ధారణ నిర్వహించుకోవాల్సి అవసరం ఉంద‌న్నారు. “ముఖ్యంగా రైల్వే, బస్టాండ్ మరియు నగర విధుల్లో వుండే యాచకులకు కరోనా పరీక్షలపై అవగాహన లేదు. ఇది దృష్టిలో వుంచుకోని పోలీస్ మరియు వైద్య శాఖ అధ్వర్యంలో నగరంలోని యాచకులకు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జ‌రుగుతోంద‌ని” ఆయ‌న వివ‌రించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన చికిత్స అందజేయబడుతుందని ఆయ‌న తెలిపారు.

ఈ కార్యక్రమములో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ యాకుబ్ పాషా, హన్మకొండ, వరంగల్ ఎ.సి.పిలు, జితేందర్ రెడ్డి, గిరికుమార్ హన్మకొండ, మట్వాడా, ఇంతేజార్ గంజ్, మీల్స్ కాలనీ,సుబేదారి ఇన్ స్పెక్టర్లు చంద్రశేఖర్ గౌడ్, గణేష్,వెంకటేశ్వర్లు, రవికిరణ్,రాఘవేందర్, హన్మకొండ ఎస్.ఐ రవీందర్ తో పాటు ఇతర పోలీస్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వ‌రంగ‌ల్ పోలీసులు క‌రోనా నేప‌థ్యంలో చేస్తున్న ఈ సేవ‌లు చూసి ప‌రిశీల‌కులు తెగ‌మెచ్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here