లాక్ డౌన్ సమయాల్లో డ్రోన్లతో గస్తీ

0
154
Spread the love

లాక్ డౌన్ సమయాల్లో డ్రోన్లతో గస్తీ
-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

ట్రై సిటీ పరిధిలో ఇకపై లాక్ డౌన్ సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా లా డౌన్ నిబంధనలు ఉ ల్లఘించిన వారిని గుర్తించడం జరుగుతుంది వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. లా డౌన్ నిబంధనలు అతిక్రమించి అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను గుర్తించేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆలోచన మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో గస్తీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇంతేజా గంజ్ పోలీసుల అధ్వర్యంలో తొలిసారిగా పోచమ్మమైదాన్ జంక్షన్లో ఎర్పాటు చేసిన డ్రోన్ కెమెరా గస్తీ పనితీరును వరంగల్ పోలీస్ కమీషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా రోడ్ల మీదకు అనవసరంగా వచ్చే వాహనాల పూర్తి వివరాలను సేకరించాల్సిన తీరుతెన్నులపై వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు పలుసూచనలను అందజేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ స్వయంగా డ్రోన్ కెమెరాను ఆపరేటింగ్ చేయడం చేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్లీల్లో పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహించాడంతో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను సీజ్ చేయాల్సి వుంటుందని. ముఖ్యంగా లాక్ డౌన్ మరింత పతిష్టంగా అమలు పర్చేందుకుగాను పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య కూడళ్ళతో పాటు ప్రధాన రోడ్డు మార్గానికి అనుసంధానంగా వుండే రోడ్డు మార్గాలపై వాహనదారుల కదలికలతో పాటు ప్రజల కదలికలను గుర్తించే విధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, వరంగల్ ఎ.సి.పి గిరికుమార్, ఇంతేజా గంజ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నరేష్ కుమార్, ఇంతేజా గంజ్ ఎస్.ఐ స్వామి పాల్గొన్నారు.
చెక్ పోస్టుల వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన పోలీస్ కమిషనర్
లాక్ డౌన్ వేళ కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చే వాహనదారులను నియంత్రించేందుకు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గల్లీల్లో పాటు ప్రధాన మార్గాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనీఖీలో పోలీస్ కమిషనర్ అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులతో పాటు పదిగంటల లోపు తమ కార్యాలయాలకు చేరుకోని ప్రభుత్వ ఉద్యోగులపై పోలీస్ కోరడా ఝళిపించారు. ఈ సందర్భంగా లాకో డౌన్ నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై పోలీస్ అధికారులతో జరిమానాలు విధించడంతో పాటు మరికొన్ని వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ తనీఖీలో సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా, హన్మకొండ, వరంగల్ ఎ.సి.పిలు జితేందర్‌రెడ్డి, గిరికుమార్‌, పాటు లా అండ్ ఆర్ధర్ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here