గాలి ద్వారా కోవిడ్.. ఎయిమ్స్ ఆందోళ‌న‌.. ఇలా చేయండి..!

0
117
Spread the love

గాలి ద్వారా కోవిడ్.. ఎయిమ్స్ ఆందోళ‌న‌.. ఇలా చేయండి..!

క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడు భార‌త్‌లో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.. ఫ‌స్ట్ వేవ్‌లో ల‌క్ష లోపే రోజువారి పాజిటివ్ కేసులు న‌మోదు అవుతూ రాగా ఇప్పుడు ఏకంగా రెండు ల‌క్ష‌ల మార్క్‌ను కూడా దాటేసి.. 3 ల‌క్ష‌ల వైపు ప‌రుగులు పెడుతున్నాయి కోవిడ్ రోజువారి కేసులు ఇక‌, గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తిచెందుతున్నాయ‌న్న వార్త‌లు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుండ‌గా గాలి ద్వారా క‌రోనా వ్యాప్తిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్‌సైన్సెస్ (ఎయిమ్స్‌) చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా.

క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం కీల‌క సూచ‌ల‌ను చేశారు ర‌ణ్‌దీప్ గులేరియా కోవిడ్ బారిన‌ప‌డ‌కుండా ఉండేందుకు ఒక ఎన్‌95 మాస్క్‌ను స‌రిగ్గా ధ‌రిస్తే స‌రిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్95 మాస్క్ కాకుండా బ‌ట్ట‌తో చేసిన లేదంటే స‌ర్జిక‌ల్‌ మాస్కులు వాడేవారైతే.. రెండు మాస్క్‌లు పెట్టుకోవాల‌ని సూచించారు. అయితే, మాస్కులు క‌చ్చితంగా నోరు, ముక్కును పూర్తిగా క‌వ‌ర్ చేసే విధంగా ధ‌రించాల‌న్నారు. క‌రోనా గాలి ద్వారా వ్యాప్తి చెంద‌డం ఆందోళ‌క‌ర‌మైన విష‌యం అన్న ఆయ‌న‌ ఇళ్ల‌లో వెంటిలేష‌న్ చాలా ముఖ్య‌మ‌న్నారు. కాగా, ఇప్ప‌టికే గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందుతుంద‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ బారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే మాస్క్ ధ‌రించ‌డం మ‌స్ట్ మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here