స్వామి వివేకానంద బోధనలు నేటికీ మరింత వర్తిస్తాయి: :స్వామి బోధమయానంద 

0
133
Spread the love

స్వామి వివేకానంద బోధనలు నేటికీ మరింత వర్తిస్తాయి: :స్వామి బోధమయానంద 

జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బలమైన యువత-బలమైన భారతదేశం’ వెబినార్

 —————————-

 హైదరాబాద్,జనవరి 12 ​​​​​               

స్వామి వివేకానంద బోధనలు నేడు మరింత సముచితమైనవని, ఇంకా రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు యువతకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ , రామకృష్ణ మఠం, హైదరాబాద్ డైరెక్టర్ స్వామి బోధమయానంద అన్నారు. 

జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్ లోని సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) , రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ వోబి) సంయుక్తంగా నిర్వహించిన “బలమైన యువత – బలమైన భారతదేశం” పై వెబినార్ లో స్వామి బోధమయానంద కీలకోపన్యాసం చేస్తూ, యువత మానసికంగా, ఆధ్యాత్మికంగా బలంగా మారడానికి స్వామి వివేకానంద బోధనల నుండి ప్రేరణ పొందాలని అన్నారు.  భారతదేశాన్ని మరింత బలంగా, శక్తివంతంగా మార్చడానికి వ్యక్తిత్వ నిర్మాణదారులుకావాలని ఆయన యువతకు ఉద్బోధించారు.  

భారతదేశ స్వాతంత్ర్య 75 సంవత్సరాలకు గుర్తుగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ప్రస్తావిస్తూ, మన స్వాతంత్ర్య సమరయోధుల సహకారాన్ని గుర్తు చేసుకోవడానికి , జాతి నిర్మాణంలో మన పాత్రను నిర్వచించడానికి ఇది సరైన సందర్భం అని స్వామీజీ అన్నారు. స్వామి వివేకానంద ఉపాధ్యాయ, నాణ్యమైన విద్య పాత్రను నొక్కి చెప్పారని, ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం -(ఎన్ ఈపీ -2020)లో ఆయన ఆలోచనలు చేర్చబడ్డాయని ఆయన అన్నారు.  

‘’ ఈ నాడు యువతకు శారీరక, మానసిక బలం లోపించి చివరికి వారిపై వారు  విశ్వాసాన్ని కోల్పో తున్నారు.  సరైన సమయంలో సరైన పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఇచ్చే సంస్థలను నిర్మించాల్సిన అవసరం ఉంది”, అని ఆయన అన్నారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా , శారీరకంగా బలంగా మారడానికి మూడు మార్గాలను వివరిస్తూ, మనం ఏమి వింటామో, మనం ఏమి చూస్తామో , ఏమి చదువుతామో అవి చాలా ముఖ్యమని ఆయన అన్నారు. రోజుకు కనీసం 15 నుంచి 20 పేజీల స్ఫూర్తిదాయక పుస్తకాన్ని చదవడానికి స్వీయ విశ్లేషణ, అభ్యాసం అంటే ‘స్వధ్యయం’ అభ్యసించాలని ఆయన యువతకు సూచించారు. 

ఉపాధ్యాయుడి ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, గూగుల్ కేవలం సమాచారాన్ని అందించగలదు కానీ ప్రేరణ ను అందించదని స్వామీజీ అన్నారు. మంచి ఉపాధ్యాయుడు విద్యార్థిలో ఉత్తమమైనది తీసుకు వస్తాడని, వ్యక్తిత్వ నిర్మాణంలో సహాయ పడతాడని అన్నారు. ‘శిక్షణ పొందిన మనస్సు తప్పు చేయదు’ అని ఆయన అన్నారు.

పిఐబి , ఆర్ ఒబి డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్ తన ప్రారంభోపన్యాసంలో, దేశ నిర్మాణానికి దోహద పడేలా యువత ను ప్రేరేపించడానికి స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని, అన్నారు. పిఐబి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ వెబినార్ కు సమన్వయ కర్తగా వ్యవహరించారు. పీఐబీ, ఆర్వోబీ, ఎన్ వైకే అధికారులు, వాలంటీర్లు, స్వామి వివేకానంద అనుచరులు, పలువురు అధికారులు, సిబ్బంది వెబినార్ లో పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here