స్వీట్‌ షాపులు, క్రాకర్‌ షాపులపై తూనికల కొలతల శాఖ దాడులు

0
117
Spread the love

 

స్వీట్‌ షాపులు, క్రాకర్‌ షాపులపై తూనికల కొలతల శాఖ దాడులు

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై 270 కేసులు నమోదు

దీపావళి పండుగ సందర్భంగా స్వీట్‌ దుకాణాలు, టపాకాయల దుకాణాలపై తూనికల కొలతల శాఖ దాడులు నిర్వహించింది. తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ యాక్ట్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్వీట్‌ షాపులపై 180 కేసులు, క్రాకర్స్‌ షాపులపై 90 కేసులు నమోదు చేశారు.

తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్‌ కమొడిటిస్‌ యాక్ట్‌ ప్రకారం ఎంఆర్‌పీ పైనే అమ్మాలి. ఎంఆర్‌పీ పై స్టిక్కర్‌లు అంటించకూడదు. సరైన తూకంతోనే అమ్మాలి. తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేది, తయారీదారు పేరు, చిరునామా, ఇతర వివరాలు ప్యాకింగ్‌ బాక్సులపై పేర్కొనాలి.

తూనికల కొలతల శాఖ అధికారులు శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు స్వీట్‌ షాపులు, క్రాకర్స్‌ షాపులపై నిర్వహించిన దాడులలో ఎన్నో ఉల్లంఘనలను గుర్తించారు.

స్వీట్‌ షాపుల్లో సరైన తూకంతో అమ్మకపోవడం, డబ్బా బరువును కూడా మిఠాయితోనే కలిపి తూకం వేయడం లాంటి అవకతవకలకు పాల్పడడం గమనించారు.

క్రాకర్స్‌ షాపుల్లో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ అమ్మడం, ఎంఆర్‌పీపై స్టిక్కర్‌లను అతికించడం, తయారీ చేసిన తేదీ, తయారీదారుని చిరునామా, ఎక్సపైరీ డేట్‌ లేకపోవడం వంటి అవకతవలకు పాల్పడడం గమినించారు.

శివారెడ్డి ప్యూర్‌ ఘీ స్వీట్స్‌-కొత్తపేట్‌, అగర్‌వాల్‌ స్వీట్స్‌-ఎల్‌బి నగర్‌, సహదేవ్‌రెడ్డి స్వీట్స్‌-దిల్‌సుఖ్‌నగర్‌, జి. పుల్లారెడ్డి స్వీట్స్‌-దిల్‌సుఖ్‌నగర్‌, అబిడ్స్‌, మిఠాయి మీల్స్‌ – ఎల్‌బినగర్‌, మిఠాయివాలా-కొత్తపేట్‌, ఆగ్రా స్వీట్స్‌ – ఆబిడ్స్‌, రతన్‌లాల్‌ మిఠాయి భండార్‌, బాలాజీ స్వీట్స్‌, న్యూ సత్యనారాయణ మిఠాయి భండార్‌-సిద్ది అంబర్‌ బజార్‌, దాదూస్‌ మిఠాయి వాలా-బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌, షగున్‌ స్వీట్‌ హౌస్‌, హిమాయత్‌నగర్‌, ఆల్పండ్‌ హౌజ్‌-హిమాయత్‌నగర్‌, బికనేర్‌వాలా-బంజారాహిల్స్‌… ఇతర స్వీట్‌ షాపులపై 180 కేసులు నమోదు చేశారు.

అలాగే అంబా భవానీ ట్రేడింగ్‌ కంపెనీ, విష్ణు ఫైర్‌ వర్కర్స్‌, శాంతి ఫైర్‌ వర్కర్స్‌, స్టాండర్డ్‌ ఫైర్‌ వర్కర్స్‌, శ్రీలక్ష్మీ ఫైర్‌ వర్కర్స్‌, అయ్యప్ప ఏజెన్సీ అండ్‌ ఫైర్‌ వర్కర్స్‌, దుర్గా ట్రేడర్స్‌, విజయశాంతి ఫైర్‌ వర్కర్స్‌, వినాయక ఏజెన్సీస్‌, శివశక్తి ఏజెన్సీస్‌…. క్రాకర్స్‌ షాపులపై 80 కేసులు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here