బెంగాలు రాష్ట్రంలో పరివర్తన భూమి పుత్రుల భావజాలానికి అనుగుణంగానే…

0
130
Spread the love

బెంగాలు రాష్ట్రంలో పరివర్తన భూమి పుత్రుల భావజాలానికి అనుగుణంగానే

 ప్రత్యేకత కోల్పోయిన బెంగాల్ …జ్యోతి ఎడిటోరియల్ పేజీలో శ్రీ యోగేంద్ర యాదవ్, స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రాసిన వ్యాసం ఆధారంగా ….

అసలు ఈ వ్యాసానికి సమాధానం రాసే ముందు బెంగాలు రాష్ట్రం భారతదేశంలో విలీనం జరిగిన నాటి నుంచి మనం తెలుసుకోగలిగితే ఈ స్వరాజ్ ఇండియా నాయకుడు ఏమిచెప్పాలనుకుంటున్నారో అందరికి అర్ధం, అవగతం అవుతుందని భావిస్తాను.

1950 వ సంవత్సరములు ఫ్రెంచ్ వారి నుంచి కొంత భూభాగం, కుచ్ బీహార్ రాజు విలీనం చేసిన ప్రాంతం, కొంత బీహారు రాష్ట్రంనుంచి కలుపుకున్న భూభాగం కలిపి పశ్చిమ బెంగాలు, భారత ప్రాంతం గాను, తూర్పు బెంగాలు దేశవిభజనలు ముస్లిం మెజారిటీ ప్రాంతంగా గుర్తించి తూర్పు పాకిస్తానుగా తరువాతి సమయంలో అదే స్వతంత్రం ప్రకటించుకొని భారత సహకారంతో బంగ్లా దేశ్ గా అవతరించడం మన కళ్ళముందు చరిత్ర.

ప్రఫుల్ల చంద్రసేన్, భారత జాతీయ కాంగ్రెస్ నుంచి 15 .08 .1947 నుంచి జనవరి 1948 దాకా ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరించారు.

23 జనవరి 1948 నుంచి 1 జులై 1962 వరకు భారత జాతీయ కాంగ్రెస్ బి. సి. రాయ్ గారు సిఎం గా వ్యవహరించారు.

పి.సి. సేన్ గారు మరల 9 జులై 1962 నుంచి 28 ఫిబ్రవరి 1967 వరకు సిఎం గా వ్యవహరించారు, ఈయన INC నుంచి.

ఏ.కె. ముఖర్జీ గారు బంగ్లా కాంగ్రెస్ నుంచి 1 మార్చి 1967 నుంచి 21 నవంబర్ 1967  సిఎం గా వున్నారు.

పి.సి. ఘోష్ ఇండిపెండెంట్ PDF అభ్యర్థిగా 21 నవంబర్ 1967 నుంచి 19 ఫిబ్రవరి 1968 వరకు 90 రోజుల కాల వ్యవధికి ముఖ్య మంత్రిగా వున్నారు.

20 February 1968 -25 February 1969  అధ్యక్ష పాలనలో బెంగాలు రాష్ట్రం.

ఏకే  ముఖర్జీ మరలా చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏప్రిల్  1971       28 జూన్  1971   అంటే 87  రోజులు, బంగ్లా కాంగ్రెస్, డెమొక్రాటిక్ ఫ్రంట్.

29 జూన్  1971   20 మార్చ్  1972 దాదాపు 265 ల కాలం అధ్యక్ష పాలనలో మరల బెంగాలు రాష్ట్రం.

20 మార్చ్  1972  – 30 ఏప్రిల్  1977  5 సం.ల 41 రోజులు శ్రీ సిద్దార్ధ శంకర్ రే, INC నుంచి ముఖ్య మంత్రిగా పని చేసిన కాలం.

తరువాత మరలా అధ్యక్ష పాలనలో బెంగాలు రాష్ట్రం.

21 జూన్  1977 నుంచి 5 నవంబర్  2000                వరకు 23 సం.లు 137  రోజులు  జ్యోతి బసు, సిపిఎం నుంచి ముఖ్య మంత్రిగా రాజ్యమేలిన రోజులు.

6 నవంబర్  2000  నుంచి 13 మే  2011  వరకు 10  సం. 188  రోజులు బుద్ధ దేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి,సిపిఎం నుంచి.

20 మే  2011  నుంచి ఇప్పటి వరకు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా మనం చూస్తూనే వున్నాము. ఈ వ్యాసం ప్రచురించే సమయానికి బహుశహా మరి ప్రభుత్వం మారను వచ్చు లేదంటే మమతా గారు మరో 5  సం కొరకు ఎన్నుకోబడను వచ్చును.

ప్రత్యేకత కోల్పోయిన బెంగాలు …

అసలు బెంగాలు ప్రాంతమే  స్వాతంత్ర సమరాంగనాన విప్లవ శంఖం పూరించి బ్రిటిషువారి గుండెలలో సింహస్వపానముగా నిలిచిందని మనము చరిత్ర ద్వారా తెలుసుకోగలం. బిపిన్ చంద్ర పాల్, బంకించంద్ర ఛటర్జీ, రాస్ బిహారీ బోస్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, మొదలుగాగల దిగ్గజాలు ఉద్భవించి స్వతంత్ర నినాదానికి సంపూర్ణ ఊపిరి పోసిన మహా నాయకమన్యులు ఆ రాష్ట్రం నుంచే అని మనం మరువకుడని సత్యం. సాక్ష్యాత్తు వివేకానందులు, రామకృష్ణ పరమహంస పరివ్రాజకులు జన్మించిన పుణ్య గడ్డ బెంగాలు ప్రాంతమే. వివేకానందుని మార్గదర్శనంలో ఎంతోమంది యువకులు జాతీయ ఉద్యమంలో పాల్గొనడం మనం మరువ కూడని విషయమే. ఆ భావజాలమే నేటికీ కూడా భారత యువకులను ఉత్తేజితులను చేస్తూ భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం ముందుకూరుకుతున్న వీర ధీరులు.  వీరంతా భారత జాతీయ జీవనానికి బాటలు పరచిన వారే. నేతాజీని గురించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. భారత జాతీయ ఆర్మీని ఆయనే మన జాతికి అందించారనేది సత్య దూరం కాదు కదా.

స్వాతంత్ర అనంతరం 74 సంవత్సరాల కాల ఖండంలో ఏమిటీ బెంగాలు ప్రత్యేకత అంటే భావజాలం గురించి అవలోకించవలసినదే. 1954  ప్రాంతంలో బెంగాలు ప్రాంతం అనావృష్టి ఆవరించింది, ఎన్నో లక్షల ఆకలి చావులు, ఎటు చూసినా పేదరికం తాండవించింది అనేది సత్య దూరం కాదనలేని సత్యం. స్వతంత్ర ముందు రోజులలో బ్రిటిషు వారి హయాములో ప్లేగు వ్యాధి ప్రబలి ఎన్నో వేల మంది చనిపోవడం మనం తెలుసుకునే వున్నాము.   1967 ప్రాంతంలో బెంగాలులో చారు మజుందార్, కాను సన్యాల్ ల నాయకత్వంలో నక్సల్బరీ ఉద్యమం ఉవ్వెత్తునే ఎగసింది. బెంగాలు ప్రాంతం అతలా కుతలం కావడం కూడా దగ్గరి చరిత్రనే.

ఎవరికీ అంతుపట్టని ఒక గొప్ప భావజాలం తుపాకీ గొట్టాం ద్వారా రాజ్యాధికారం అంటూ ప్రజలు ప్రభుత్వం మీద తిరుగబడిన క్షణాలు ఎలా, ఎందుకు ఎక్కడి నుంచి ఈ రకమైన ఆలోచనా విధానం ప్రబలింది యోచించవలసినదే. బెంగాలు రాష్ట్రం ప్లేగు వ్యాధితో రగిలిపోయింది లాకాశాలమంది జనం పిట్టల్లా రాలిపోయారు. అనావృష్టి మూలకంగా ఎన్నో లక్షల ఆకలి చావులు అయ్యాయి బెంగాలు ప్రాంతం తల్లడిల్లిపోయింది. ఈ అంతుపట్టని విషయం బ్రిటిషు వారిమీద ప్రజలు తిరగబడలేదు, ఇటు కాంగ్రెస్ అధికారంలో వున్నసమయంలో కూడా ప్రజలు తిరగబడలేదు.  ఎక్కడినుండి ఎవరిద్వారా తుపాకీ గొట్టాం భారతదేశంలో ప్రవేశించి తమ సొంత మనుషులనే పొట్టన పెట్టుకునే సందర్భం ఏర్పడింది ఈ భావజాలం.

బెంగాలు ప్రాంతం కొంచెం దాటితే చైనా దేశం ఎల్లలు వస్తాయి. చైనా తిబ్బత్ ప్రాంతాన్ని అప్పటికే ఆక్రమించుకున్నాడు అనేది సత్యమే. ఈ ఆక్రమణ వాడ దేశం నెమ్మదిగా జరుగుతూ భారత దేశంలో అశాంతిని లేపి తమ భావజాలం ద్వారా భారతీయుల మధ్యన చిచ్చులేపి ఆ విధంగా తమ ఆశయమైన ఆక్రమణను చేయ సంకల్పించింది అనడానికి ఏవిధమైన సందేహం ఉంటుందా?

అమాయక భారతీయ యువత వివేకానందుని బోధనలతో ప్రేరణ పొందిన యువత అన్యాయంగా తుపాకిగొట్టానికి బలికావడానికి చైనా కారణం అవుతే దానికొరకు కొన్ని స్వార్థపర శక్తులు తమ ఆశయమైన అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం విదేశీ శక్తులకు సహకరించడం సత్యదూరంకాదని భావించవలసినదే. దీనిని ఏవిధమైన భావజాలంగా భావించారో ఈ రచయితగారు దేశ ప్రజలకు తెలియ చేయవలసియున్నదిగా భావించవలసినదే.

కాంగ్ తమ చేతకాని తనంతోటి 25 సం.లు పాలన చేస్తే, దోపిడీలు దొంగతనాలు దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయి. దాదాపుగా 35 సం.లు కమ్యూనిస్టులు  పాలనను పంచుకొని తుపాకీ గొట్టం భావజాలానికి తమవంతు పూర్తి సహకారాన్ని అందించి దేశంలో రెడ్ కారిడార్ ను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి తద్వారా సముద్ర తీరప్రాంత భారతావనిని కమ్యూనిస్టు చైనాకు ధారాదత్తం చేయడమే భావజాలంగా ముందుకు పోయిన తీరు కాస్త ఆలోచనా శక్తి కలిగినవారికి అవగతం కాదంటారా? రచయిత గారు ఈ భావజాలమేనా మీరు చెబుతున్నది.

ఈ రచయితను ఢిల్లీ సిఎం గారు తన్ని తగలేసింది ఎందుకంటే ఇదిగో ఈ లాటి తలతిక్క రాత పోతలు, మాటలు చేయడం మూలకంగానే. బిజెపి కులాల మధ్యన కుమ్పటి పెట్టిందిట, ఇది ఒక పేరాలో. వెంటనే తరువాతి పేరాలో హిందువులను సంఘటితం చేశారట. కులాలు హిందువులలో భాగమేగా. హిందువులు వివిధ కులాల వారు అవుతే కులాల కుంపట్లు రాజేస్తే హిందువుల ఓటు బ్యాంకు ఎలా తయారవుతుంది. వీరికి అత్యున్నత పురస్కారాలు ఎవరు ఎందుకు ఇచ్చారో ఆ ఇచ్చినవారికి ఈ తీసుకున్న వారికి తప్పించి ఎవరికీ తెలుస్తుంది అంటారు. ఎదో లోగుట్టు కనపడుట లేదా?

1971 బంగ్లాదేశ్ అవతరణతో ఆ దేశం నుంచి వలస వచ్చిన బంగ్లాదేశ్ ముస్లిం మైనారిటీలు నెమ్మదిగా బెంగాలుకు బంగ్లాకు ఎల్లలు వద్ద పూర్తిగా ఆక్రమించుకోవడం వారు అధికారంలో ఎవరు ఉంటే వారి కొమ్ము కాస్తూ ఆయా ప్రదేశాలను ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా చేసుకొనే ప్రక్రియలో ముందుకు పోవడంలో హిందువుల మీద వారి దారుణాలు, దాష్టికాలు తప్పక చర్చించాలి మనం ఇక్కడ. అందుకే మొదటి సారిగా బిజెపి వారికి ఆయా ప్రాంతాలలో హిందువుల ఓటు సంపూర్ణంగా రావడం జరిగింది. ముందు కాంగ్ వారి పాలనలో, కమ్యూనిస్టుల పాలనలో ఆలనా పాలనా లేని హిందువులలోని నిమనజాతి వర్గాలకు అండ దొరికినది ఇక్కడే.

మమతా దీదీ గారు  పది సంవత్సరాల పాలనలో బంగ్లా ముస్లిం సంతుష్టికరణ యజ్ఞాన్ని చేశారని ఎవరు అక్కడి రాజకీయాలను గమనించినా అర్ధం అవుతుంది. మన రచయితగారికి తప్పించి  ఎందుకంటే వారి మెదడు మోకాలిలో వున్నదని కేజ్రీవాల్ గారు అంటూవుంటారుట. నిన్న మొన్న జరిగిన ఎన్నికల ప్రక్రియలో కూడా ముస్లింలు అందరు నాకే ఓటు వేయాలి తద్వారా హిందువులకు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. దుర్గా ఉత్సవాలు జరుపుకోవడానికి వీలులేదు అని ఉత్తరువులు ఇచ్చారు, ఉత్తరువులను అధిగమించినవారిని జైళ్లలో నిర్బంధించారు. ఆ విధంగా ఓటు పోలరైజేషనుకు పూర్తి స్థాయి ప్రయాస చేశారు.  ఈ భావజాలం కనపడలేదా రచయిత యాదవు గారు.

జాతీయ వాడ నినాదంతో బిజెపి బెంగాలులో అణగారిన, అణచివేయబడుతున్న హిందువుల మనోభావాలను తట్టి లేపి వారిని కార్యోన్ముఖులుగా చేసి బంగ్లా ముస్లిము వారిని వారి వారి ప్రదేశాలకు పంపిస్తాము అని అక్కడి హిందువులకు బాసటగా నిలిచినందుకే బిజెపి వారికి అందునా శ్రీమాన్ నరేంద్ర మోడీ గారికి అక్కడి బ్రహ్మరధం పట్టడం, అక్కడి ప్రజలలో పరివర్తన పట్ల సమున్నతమైన నమ్మిక రావడంతో, ప్రధాని నరేంద్ర మోడీ గారి భావజాలానికి అక్కడి వారు ప్రణమిల్లుతున్నారనేది సత్య దూరమే కాదు.

74 సంవత్సరాల భారత స్వతంత్ర జీవన కాలంలో బెంగాలులో 64 సం. కాంగ్ కమ్మీలు రాజ్యమేలితే కామినిస్టులు పూర్తిగా బలపడి బెంగాలు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి రాకుండా చేస్తే,  మిగతా పది సంవత్సరాలు తృణమూల్ కాంగ్ అధికారంలో వుండి ముస్లిం సంతుష్టికరణ మంత్రంతో అటు కమ్మీలను, ఇటు కాంగీలను కాదని ఏడు బంగ్లా ముస్లిం చాందస వాదుల గుప్పిటలో కూరుకు పోయిన తృణమూల్. వీరికి సమాధానమే పరివర్తన పేరుతో జాతీయ వాదాన్ని ప్రేరేపించి అటు భారతీయ ముస్లింలను, ఇటు హిందువులను ఏకత్రితమ్ చేసిన ఘనత బిజెపి వారిదేనని అనడంలో సందేహములేదు. ఎర్ర కారిడార్ కలగానే మిగిలిపోయే రోజులు దగ్గర పడ్డాయి. కమ్మి పార్టీలు కుదేలుమన్నాయి. కాంగ్ సోదిలో లేకుండా పోయింది. ఇప్పటి భావజాలం కేవలం జాతీయవాదమే, తెలుసుకోవాలి రచయిత గారు.

భావజాలం పేరుతో తలతిక్క వంకరటింక రాతలు రాసే మీ వ్యాసాలూ ప్రచురిస్తున్న ఈ పబ్లిషర్లు ఎంతటి దుర్మార్గులో రాబోయే రోజులలో వీరికి కావలసిన గుణపాఠం ప్రజలే నేర్పుతారు వారి భావజాలానికి తగిన విధంగా…

Writes Anasuya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here