ప్రాణం తీసిన‌….విద్యుత్ రైస్ కుక్క‌ర్ || త‌ల్లి మృతి || అనాథ‌లైన లోకజ్ఞానం లేని ఇద్దరు కుమారులు

0
659
Spread the love

ప్రాణం తీసిన‌….విద్యుత్ రైస్ కుక్క‌ర్ || త‌ల్లి మృతి || అనాథ‌లైన లోకజ్ఞానం లేని ఇద్దరు కుమారులు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన మట్ట విజయ అనే మహిళ తన ఇంట్లో రైస్ కుక్కర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గత పదిహేను రోజుల క్రితం ఇదే ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ తో ఒకరు చనిపోగా…. తిరిగి ఇదే ప్రాంతంలో మ‌రొక‌రు చ‌నిపోవ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రెంటు షాకుల‌తో వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌విస్తుండంతో గ్రామస్తులు తీవ్ర‌ భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ శౄఖ‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భ‌ర్త‌ గతంలోనే భర్త చనిపోగా, లోకజ్ఞానం లేని ఇద్దరు కుమారులు ఈ దంప‌తుల‌కు ఉన్నారు. వారిద్దరికి అన్ని తానై తల్లి విజయ పెంచి పోషిస్తోంది…. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆ తల్లి కూడా చనిపోవడంతో ఇద్దరు కుమారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఎలాగైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కరెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here