*వైక‌ల్యాన్ని జ‌యించి విజ‌యం వైపు ప‌య‌నించండి – దాన‌కిషోర్‌*

0
93
Spread the love

*వైక‌ల్యాన్ని జ‌యించి విజ‌యం వైపు ప‌య‌నించండి – దాన‌కిషోర్‌*

ప్ర‌తి మ‌నిషిలో వైక‌ల్యం అనేది ఉంటుంద‌ని, దానిని వైక‌ల్యంగా భావించకుండా ముందుకు సాగాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ అన్నారు. ప్ర‌పంచ విక‌లాంగుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ట్యాంక్‌బండ్ అంబేడ్క‌ర్ విగ్ర‌హం నుండి జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ర‌కు ఓట‌రు చైత‌న్యం పై విక‌లాంగులు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో విక‌లాంగుల వీల్ ఛైర్‌ల‌ను స్వ‌యంగా న‌డుపుతూ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న‌లు పాల్గొన్నారు. అనంత‌రం జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో దాన‌కిషోర్ మాట్లాడుతూ అంగ‌వైక‌ల్యం అనేది స‌మ‌స్య‌గా భావించ‌కుండా ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. విక‌లాంగుల స‌మ‌స్య‌ల‌ను త‌మ దృష్టికి తెచ్చిన‌ట్టైతే వెంట‌నే ప‌రిష్క‌రించ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. అంద‌రికీ అందుబాటులో ఎన్నిక‌లు అనే నినాదంతో డిసెంబ‌ర్ 7న జ‌రిగే పోలింగ్‌కు అర్హులైన దివ్యాంగులంద‌రూ ఓటింగ్‌లో పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేశామ‌ని తెలియ‌జేశారు. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల్లో విక‌లాంగుల సౌక‌ర్యార్థం 1500 వీల్ ఛైర్‌లు, ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో ర్యాంప్‌ల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌తి విక‌లాంగుడు పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా ఉచిత‌ ర‌వాణా వాహ‌నాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌తి పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఎన్‌.ఎస్‌.ఎస్‌, ఎన్‌.సి.సిల నుండి ప్ర‌త్యేక స‌హాయ‌కుల‌ను నియ‌మిస్తున్నామ‌ని తెలియ‌జేశారు. దివ్యాంగుల సౌక‌ర్యార్థం జీహెచ్ఎంసీ మొట్ట‌మొద‌టి సారిగా వాదా యాప్‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తాము ఓటువేసే పోలింగ్ కేంద్రం, స‌మ‌యాన్ని పేర్కొన్న‌టైతే త‌మ ఇంటి వ‌ద్ద‌కు వాహ‌నం వ‌చ్చి తీసుకెళుతుంద‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త ఎన్నిక‌ల్లో త‌క్కువ ఓటింగ్ శాతం న‌మోదు అయ్యింద‌ని, ఈ సారీ డిసెంబ‌ర్ 7న జ‌రిగే ఓటింగ్‌లో ప్ర‌తిఒక్క‌రూ పాల్గొనేలా కృషిచేయాల‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా విక‌లాంగుల‌కు ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్లు, వివిప్యాట్‌ల పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని జిల్లా ఎన్నిక‌ల అదికారి దాన‌కిషోర్ స్వ‌యంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న‌, ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ సౌజ‌న్య‌, దైవ‌జ్ఞ‌శ‌ర్మ‌, విక‌లాంగుల హ‌క్కుల వేదిక అధ్య‌క్షులు కొల్లి నాగేశ్వ‌రరావు, రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ఎం.ధ‌నుంజ‌య, వేదిక ప్ర‌తినిధులు న‌గేష్‌, శ్రీ‌నివాస్‌, జ్యోతి, స్వామి, ఉమ‌ర్ ఖాన్‌, ముస్తాక్ అలీ, శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here