మరింత ఉగ్రరూపం దాల్చిన యాస్ తుఫాన్

0
161
Spread the love

మరింత ఉగ్రరూపం దాల్చిన యాస్ తుఫాన్

బాలసోర్ సమీపంలోని తీరం దాటిన వాయువ్య దిశగా పయనం 

   గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు

ఒడిశా మే 26 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుఫాన్‌గా మారి బాలసోర్ సమీపంలోని తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ మరో మూడు గంటల్లో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు హైఅలర్ట్ ప్రకటించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల్లో దాదాపు 52 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here