ఏది బెట‌రూ.. ఫ్లాటా ? ఓపెన్ ప్లాటా ? ఇల్లూ.. ?

0
216
Spread the love

అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాంట్ బెట‌రా..?
ఓపెన్ ప్లాట్‌…బెట‌రా.. ?
ఇండిపెండెంట్ ఇల్లు బెట‌రా.. ?


Hyderabad(TOOFAN) – అంటే ఖ‌చ్చితంగా సింగ‌ల్ వర్డ్‌లో ఇది మంచిద‌ని, అది మంచిది కాద‌ని తేల్చ‌డం క‌ష్టం. అయితే ముందుగా మ‌నం దేనికోసం ఫ్లాట్ గాని, ఓపెన్‌ ప్లాట్ గాని, ఇండిపెండెంట్ ఇల్లు గాని తీసుకుంటున్నామో క్ల‌రిటీ ఉండాలి. లేకుంటే ఆ రంగానికి చెందిన నిపుణుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాలి. . సాధ్య‌మైనంత వ‌ర‌కు ఎక్కువ శాతం ప్ర‌జ‌లు ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచ‌న‌తోనే తీసుకుంటారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లోనే త‌న కూతురు పెళ్లి , కోడుకు ఉన్న‌త చ‌దువు లేదా తాను రిటైర్డు అయ్యాక సోంతింటి క‌ల‌ ఉంటుంది. ఈ పొదుపులో త‌నకు భ‌ద్ర‌త‌, త‌న ఫ్యామిలీకి భ‌రోసా, స‌మాజం నుంచి గుర్తింపు అంత‌ర్లీనంగా ఉంటాయి. చాలా మంది ఆలోచ‌న ఇదే అయిన్న‌ప్ప‌టికీ.. కొంద‌రి ఆచ‌ర‌ణ మాత్రం అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్ వైపు ఉంటుంది. త‌క్ష‌ణ‌మే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంటే రెంట్ బాధ త‌ప్పుతుంద‌ని , ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్ఠ ప‌త‌నంతో త‌మ పిల్ల‌ల్ని ఎవ‌రూ చూసుకునే వాళ్లు లేక అక్క‌డి సెక్యూరిటీ , ప్లే గ్రౌండ్ , క్ల‌బ్ హోజ్‌, స్విమ్మింగ్ పూల్‌, జిమ్‌,ఇండోర్ గేమ్స్ బాగుంటాయ‌ని మొగ్గు చూపుతారు. అది త‌ప్పేం కాదు కూడా. అయితే ఇక్క‌డ వ‌చ్చిన చిక్కంతా స్వ‌ల్ప‌కాలంలో వాటిలో పొదుపు చేసి దీర్ఘాకాలం వాటితో పోల్చుకోవ‌డ‌మే త‌ప్పు. అంటే ఫ్లాట్ కొన్న వారికి కాల‌క్ర‌మంలో ఇండిపెండెంట్ ఇల్లు లేదా ఓపెన్ ప్లాట్ తీసుకున్న వారితో స‌మానంగా భ‌విష్య‌త్‌లో లాభాలు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉండ‌దు. ఎందుకంటే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ అప్రిషియేష‌న్ మొద‌టి 15-20 ఇయ‌ర్స్ వ‌ర‌కు మాత్ర‌మే పెరుగుద‌ల ఉంటుంది. కాని త‌ర్వాత క్ర‌మంగా ఆ ఫ్లాట్‌పై డిప్రిషియేష‌న్ వ‌స్తుంది. అంటే త‌గ్గుద‌ల వ‌స్తుంది. నాడు ఫ్లాట్ కొన్న‌ప్ప‌టి కంటే.. నేడు అమ్మే టైంకు రేట్ ప‌డిపోతుంది. 30 ఇయ‌ర్స్ దాటితే బ్యాంకులు లోన్ కూడా ఇవ్వ‌వు. అందువ‌ల్ల రీసేల్‌లో ఎవ‌రైనా కొందామ‌న్నా… ఆస‌క్తి కూడా చూప‌రు. ఎప్పుడైనా..భూమి మీదా రేటు పెరుగుతుంది త‌ప్పా .. క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌పై రేట్ పెర‌గ‌దు. పైగా త‌గ్గుతుంది. అందువ‌ల్ల దీర్ఘాకాలంలో తోడుగా ఉంటుంద‌ని భావించి తీసుకున్న ఫ్లాట్ క్ర‌మంగా భారంగా మారుతుంది.

హౌసింగ్‌.కామ్ స‌ర్వే రిపోర్ట్ ప్ర‌కారం … ఇత‌ర బెంగ‌ళూరు, చెన్నై స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోల్చితే హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ఓపెన్ ప్లాట్ల‌కు 2018-21 మ‌ధ్యకాలంలో న‌గ‌ర‌లంలోని స్థ‌లాల‌కు గ‌రిష్టంగా 21 శాతం వార్ష‌క వృద్ధిరేట్ న‌మోద‌యింది. ఇండిపెండెట్ ఇళ్ల‌కు కూడా డిమాండ్ పెరిగింది, సాదార‌ణం కంటే, క‌రోనా మ‌మ్మాహారి త‌ర్వాత అంది మ‌రింత రెట్టింపైంది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అపార్ట్‌మెంట్ వాసుల‌కు, ర‌ద్దీ ప్రాంతాల్లోని వారిపైనే ఎక్కువ‌గా ప్ర‌భావాన్ని చూపించింది. వైర‌స్ బాధితులు, మ‌ర‌ణాల సంఖ్య కూడా ఇక్క‌డే అధికంగా ఉంది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల ఆలోచ‌న స‌ర‌ళిలో మార్పు వ‌చ్చింది. క‌స్ట‌మ‌ర్ల చూపు న‌గ‌ర శివారులోని షాద్ న‌గ‌ర్‌, మ‌హేశ్వ‌రం, స‌దాశివ‌పేట‌, యాదాద్రి, షాబాద్‌, మెడ్చెల్‌, కీస‌ర‌, మోయినాబాద్‌, చేవేళ్ల‌, ఇబ్ర‌హీంప‌ట్నం, క‌డ్తాల్‌, భువ‌న‌గిరి, ఘ‌ట్కేస‌ర్‌, చౌటుప్ప‌ల్‌, వంగ‌ప‌ల్లి, తూప్రాన్‌, సంగారెడ్డి, శంక‌ర్‌ప‌ల్లి స‌హా ప‌లు ప్రాంతాల‌కు మ‌ళ్లింది. మ‌రికొంద‌రైతే .. గ్రామీణా ప్రాంతాల‌కు వెళ్లి అర ఏక‌రా, ఎక‌రా, గుంట‌ల చోప్పునసైతం తీసుకుంటున్నారు. జ‌న‌వాసాల మ‌ధ్య కంటే ఇండిపెండెంట్‌గా ఉండ‌ట‌మే మేల‌ని భావిస్తున్నారు. వ్య‌క్తిగ‌త గృహాల కొనుకోలుకు మెగ్గు చూపుతున్నార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి, దేశంలోని హైదారాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ, అహ్మాదాబాద్‌,పూనే సహా ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో చేసిన స‌ర్వే రిపోర్ట్ ప్ర‌కారం అపార్ట్‌మెంట్ల ఫ్లాట్‌పై వార్షిక వృద్ధి రేట్ 2 శాతం మాత్ర‌మే ఉండ‌గా,, ఓపెన్ ప్లాట్ల‌పై మాత్రం స‌రాస‌రి 7 శాతంకు పైగా ఉన్న‌ట్లు తేలింది. శివారులోని భూముల‌కు గాకుండా ప్ర‌ధాన న‌గ‌రాల్లోని భూములు, ఇండ్ల‌కైతే ఏకంగా 13-21 శాతం వార్షిక వృద్ధి రేటు న‌మోదు అయింది, ఏది ఏమైన్న‌ప్ప‌టికీ.. పొదుపు అనేది మాత్రం భ‌విష్య‌త్‌కు భ‌రోసానిస్తోంద‌ని చెప్ప‌డంలో సందేహాం లేదు. ఆయా ప‌రిస్థితుల్నిబట్టి లాభాల్లో తేడాలుంటాయి. ఏది గుడ్డిగా న‌మ్మోద్దు. అట్లాని న‌మ్మ‌కుండా పొదుపుకు దూరంగా ఉండొద్దు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇప్ప‌టికీ చాలా మంది బ‌డా బ‌డా డెవ‌ల‌ప‌ర్స్ , కంపెనీలు డిమాండ్‌కు మించి అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేశారు. ప్రిలాంచ్ పేరుతో త‌క్కువ ధ‌ర‌ల‌కే ఫ్లాటంటూ కోనుగోలు దారుల‌కు క‌ట్ట‌బెట్టారు. అయినా.. ఇప్ప‌టికీ ల‌క్ష‌ల‌కు, ల‌క్ష‌లు అపార్ట్‌మెంటు ఫ్లాట్లు మిగిలే ఉన్నాయన్న తెలియంది కాదు. దీన్ని స‌రిగ్గా అర్థం చేసుకొని కొని సంస్థ‌లు రీయ‌ల్ ఏస్టేట్ ఢ‌మాల్ అంటూ త‌ప్పుడు క‌థ‌నాలు ఇస్తోంది. ఇక్క‌డ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లు మాత్ర‌మే మిగిలిపోతే.. మొత్తం రియ‌ల్ ఏస్టేట్ కు ఆపాదించ‌డం అవివేకం అవుతుంది. ఇన్వెస్ట‌ర్ల‌ను మ‌రింత క‌న్‌ఫ్యూజ్ చేయడం అవుతుంది. సో మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకొండి. చిన్న‌దైనా పొదుపు చేయండి. మీ పిల్ల‌ల భ‌విష్య‌త్‌కు , మీ భ‌ద్ర‌త‌కు రాబడిని పెంచుకొండి.


వ్యాస‌క‌ర్త

య‌న‌మ‌ల రాజు,

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌,

రీయ‌ల్ ఏస్టేట్ ఎక్స్‌ప‌ర్ట్‌.-9000100280 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here