జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

0
51
Spread the love

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

హైదరాబాద్, జూన్ 21: 
  యోగా ప్రజలు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, ప్రకృతి లో మమేకం కావడానికి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు అందిస్తూ… ఆలోచనలు, చేసే పనిలో నిగ్రహం నెరవేర్పును ఒకటి చేస్తుందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉద్యోగులకు వివరించారు. 

          8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన యోగా ఫర్ హ్యుమానిటీ అనే థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ (ఇషా ఫౌండేషన్) ఉద్యోగులకు యోగా ప్రాముఖ్యత ను వివరించారు. యోగా ద్వారా ధ్యానం, ఒక వ్యక్తి మనసా, వాఛ, కర్మన, జ్ఞానం, భక్తితో క్రమశిక్షణ ద్వారా మెరుగైన వ్యక్తిగా తయారు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రోజురోజుకు భూమిపైన తగ్గిపోతున్న మట్టిని రక్షించుకునేందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సద్గురు సందేశాన్ని వివరించారు. యోగా ద్వారా హ్యూమినిటీ, ఇంటిగ్రిటీ, శరీరానికి ఆరోగ్యం వస్తుందని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో ప్రతిరోజు యోగాను సాధన చేసి మంచి ఫలితాలు పొందాలన్నారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అడ్మిన్ సరోజ, సెక్రటరీ లక్ష్మి, ఏ.సి.పి తులసి రామ్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here